గంగూలీని మొదట నేనే అభినందించా: ప్రశంసల వర్షం కురిపించిన రవిశాస్త్రి

హైదరాబాద్: పింక్ బాల్ టెస్టు విజయవంతం కావడంలో కీలకపాత్ర పోషించిన బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీపై టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి ప్రశంసల వర్షం కురిపించాడు. ఈడెన్ గార్డెన్స్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన డే నైట్ టెస్టు మ్యాచ్‌లో టీమిండియా ఇన్నింగ్స్ 46 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది.

టీమిండియాకు వరుసగా నాలుగో ఇన్నింగ్స్ విజయం
టీమిండియాకు ఇది వరుసగా నాలుగో ఇన్నింగ్స్ విజయం కావడం విశేషం. ఫలితంగా టెస్టు క్రికెట్ చరిత్రలో ఈ ఘనత సాధించిన మొదటి జట్టుగా టీమిండియా చరిత్ర సృష్టించింది. ఫలితంగా రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను 2-0తో వైట్‌వాష్ చేసింది. ఈ విజయంతో టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భారత్ 360 పాయింట్లకు చేరింది.

శాస్త్రి మాట్లాడుతూ
దీంతో పాటు స్వదేశంలో వరుసగా 12 టెస్టుల సిరీసులు గెలిచిన జట్టు టీమిండియా చరిత్ర సృష్టించింది. రవిశాస్త్రి మాట్లాడుతూ "ఇది నిజంగా ఫెంటాస్టిక్. బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ ఎన్నికైన తర్వాత అతడిని అభినందించిన మొదటి వ్యక్తుల్లో నేను ఒకడిని. అతడి అధ్యక్షతన బీసీసీఐకి పూర్వవైభవం వస్తుంది. కీలక సమయంలో సౌరవ్ గంగూలీ అధ్యక్ష పదవి చేపట్టడం ఎంతో సంతోషంగా ఉంది" అని అన్నాడు.

గంగూలీ ఆటగాడు మాత్రమే కాదు కెప్టెన్
"గంగూలీ అద్భుతమైన ఆటగాడు మాత్రమే కాదు కెప్టెన్. గొప్ప పాలకుడు కూడా. అధ్యక్ష పదవికి ఎన్నికవ్వడం అతడికి మరింత విలువలను పెంచింది. చారిత్రక టెస్టును గొప్పగా నిర్వహించిన దాదాకి, బంగాల్ క్రికెట్ అసోషియేషన్‌కు హ్యాట్సాఫ్. డే నైట్ టెస్టులో ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందన అద్భుతం" అని రవిశాస్త్రి కొనియాడారు.

ఓ పండుగ వాతావరణన్ని తలపించిన డే నైట్ టెస్టు మ్యాచ్
"డే నైట్ టెస్టు మ్యాచ్ ఓ పండగ వాతావరణాన్ని తలపించింది. క్రికెట్ పరంగా మాట్లాడితే పాజిటివ్, నెగిటివ్‌లు ఉంటాయి. గులాబీ బంతి దాని ప్రకాశాన్ని ఎలా నిలుపుకోగలదు, దాని ఆకృతి భవిష్యత్తులో పరీక్ష అవుతుంది. ఈ మ్యాచ్‌లో ఇప్పుడు ప్లస్ మరియు మైనస్‌లను ఇచ్చింది" అని రవిశాస్త్రి వెల్లడించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications