For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'యువరాజ్‌తో కఠినంగా వ్యవహరించిన విషయం వాస్తవమే'

I was harsh on Yuvraj as I wanted to prove a point, says father Yograj

హైదరాబాద్: యువరాజ్‌ సింగ్ పట్ల తాను కొన్నిసార్లు కఠినంగా వ్యవహరించిన విషయం వాస్తవమేనని అతడి తండ్రి యోగిరాజ్ సింగ్ తెలిపాడు. 19 ఏళ్ల పాటు భారత క్రికెట్‌కు సేవలందించిన టీమిండియా వెటరన్ క్రికెటర్ యువరాజ్ సింగ్ సోమవారం అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

భార్య, తల్లితో కలిసి ముంబైలోని ఓ హోటల్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో 37 ఏళ్ల యువీ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించాడు. తన రిటైర్మెంట్ సందర్భంగా తన తండ్రి యోగ్‌రాజ్‌ సింగ్‌ను యువరాజ్‌ డ్రాగన్‌తో పోల్చిన సంగతి తెలిసిందే. ఆయనే తన తొలి గురువని యువీ తెలిపాడు.

"నా తండ్రి యోగ్‌రాజ్‌ సింగ్‌ నాకు తొలి గురువు. మా ఇద్దరి రిలేషన్‌ షిప్‌ చాలా వెరైటీగా ఉండేది. పదేళ్ల వయసులోనే 16 ఏళ్ల పిల్లవాడిలా పరిగెత్తించేవాడు. కష్ట సమయాల్లో నా తండ్రి నాకు తోడుగా ఉన్నాడు" అని యువరాజ్ తెలిపాడు. దీనిపై తాజాగా యోగ్‌రాజ్‌ స్పందించాడు.

"నీపట్ల (యువీ) నేను కఠినంగా వ్యవహరించానంటే.. ప్రపంచానికి నువ్వేంటో చాటిచెప్పాలనే. ఆ విషయం నీకర్థమైందని అనుకుంటున్నా" అని మాజీ క్రికెటర్‌ యోగ్‌రాజ్‌ చెప్పాడు.

యువరాజ్ రిటైర్మెంట్ పూర్తి స్పీచ్ ఇదే:
"మాటల్లో చెప్పలేకున్నా.. అయినా ట్రై చేస్తా. 25 ఏళ్ల తర్వాత... 22 గజాలు... 17 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్. వీడ్కోలు పలకడానికి ఇదే సరైన సమయం" అని యువరాజ్ సింగ్ అన్నాడు. క్రికెట్‌ను తాను ఎంతగానో ప్రేమిస్తానో... అంతే స్థాయిలో అసహ్యించుకుంటానని కూడా యువీ అన్నాడు.

"క్రికెట్ నాకు జీవితంలో అన్నీ ఇచ్చింది, అందుకే అదంటే ఇష్టం. అదే సమయంలో మానసికంగా తనను ఎంతో క్షోభకు గురిచేసిందని, అందుకే అదంటే నాకు అసహ్యం(నవ్వుతూ). నేను సక్సెస్ సాధించిన దానికంటే ఎక్కువ సార్లు ఫెయిల్ అయ్యా. నా దేసం తరుపున ఆడటం కోసం రక్తం, స్వేదం ధారపోశాను. క్యాన్సర్‌ బాధితులకు సాయం అందించడమే నా తదుపరి లక్ష్యం" అని యువీ భావోద్వేగానికి గురయ్యాడు.

"2000లో నా కెరీర్‌ను ఆరంభించాను. 19 ఏళ్లు పూర్తయ్యాయి. నా కెరీర్‌ను ఎలా ముగించాలనే గందరగోళంలో ఉండేవాడిని. ఈ ఏడాది ఐపీఎల్‌లో ఇంకా ఎక్కువ మ్యాచ్‌లు ఆడి ఉంటే నాకు ఇంకాస్త సంతృప్తిగా ఉండేది. ఆ సంతృప్తితో క్రికెట్‌ నుంచి వెళ్లిపోయేవాడిని. అయితే జీవితంలో అనుకున్నవన్నీ జరగవు కదా. 2019 ఐపీఎలే నాకు చివరిది అని గతేడాదే నిర్ణయించుకున్నా" అని యువీ అన్నాడు.

"ఇకపై ఐపీఎల్‌కు నేను అందుబాటులో ఉండను. బీసీసీఐ, అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి రిటైర్మెంట్‌ తీసుకుంటున్నా. నా జీవితంలో అత్యంత చెత్త రోజు అదే. 2014లో వరల్డ్ టీ20 శ్రీలంకతో జరిగిన ఫైనల్ మ్యాచ్. ఆ రోజే అనుకున్నా.. నా కెరీర్ ముగిసిందని. క్రికెట్ నాకు ఎంతో మంది సీనియర్స్‌తో పాటు స్నేహితులను ఇచ్చింది. సౌరవ్ గంగూలీ నాయకత్వంలో నా కెరీర్ ఆరంభమైంది" అని యువీ తెలిపాడు.

"నా ఐడల్ సచిన్ టెండూల్కర్, లెజెండరీ క్రికెటర్లు రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్, జవగళ్ శ్రీనాథ్, ధోని నాయకత్వంలో 2011 వరల్డ్ కప్ గెలవడం. నా క్రికెట్ జీవితం ఓ అందమైన కథ అని, అది ముగింపు దశకు చేరుకుంది" అని చెబుతూ యువరాజ్ సింగ్ భావోద్వేగానికి గురయ్యాడు.

"నా తండ్రి యోగ్‌రాజ్‌ సింగ్‌ నాకు తొలి గురువు. మా ఇద్దరి రిలేషన్‌ షిప్‌ చాలా వెరైటీగా ఉండేది. పదేళ్ల వయసులోనే 16 ఏళ్ల పిల్లవాడిలా పరిగెత్తించేవాడు. కష్ట సమయాల్లో నా తండ్రి నాకు తోడుగా ఉన్నాడు" అని యువరాజ్ తెలిపాడు. "సెలక్టర్లు, సౌరవ్ గంగూలీకి ధన్యవాదాలు. ముఖ్యంగా చందు బోర్డే, టీఏ శేఖర్ మరికొంతమందికి. ఇదే ఖచ్చితమైన రోజు" అని యువీ అన్నాడు.

"బీసీసీఐ నుంచి అనుమతి లభిస్తే భారత్‌ బయట టీ20 లీగుల్లో ఆడేందుకు ఎదురు చూస్తున్నా. ఈ వయసులో ఎంజాయ్‌ చేస్తూ ఆడే టోర్నీల్లో అయితేనే ఆడగలను అనిపిస్తుంది. అంతర్జాతీయ కెరీర్‌ గురించి ఆలోచించుకుంటూ ఐపీఎల్‌ లాంటి పెద్ద పెద్ద టోర్నీల్లో ఆడటం అనేది చాలా ఒత్తిడితో కూడుకున్నది. అందుకే బీసీసీఐ అనుమతితో విదేశాల్లో టీ20 లీగ్‌లు ఆడాలని ఉంది" అని యువీ చెప్పుకొచ్చాడు.

Story first published: Wednesday, June 12, 2019, 10:04 [IST]
Other articles published on Jun 12, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+