Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆ హీరోయిన్‌తో డేటింగ్ చేశా.. ఆస్ట్రేలియాలో ఆ రాత్రి!: యువరాజ్ సింగ్

టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఓ పోడ్‌కాస్ట్‌లో పాల్గొన్న యువీ తన వ్యక్తిగత కబుర్లు చెప్పాడు. తాను ఓ హీరోయిన్‌తో డేటింగ్ చేశానని తెలిపాడు. ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నప్పుడు ఆ నటితో జరిగిన సంఘటనను సిక్సర్లు వీరుడు వివరించాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2007/08 కోసం ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన దాని గురించి మాట్లాడాడు.

''ఓ హీరోయితో డేటింగ్ చేశాను. ఆమె పేరు చెప్పను. కానీ అప్పుడు ఆమె గొప్ప నటి, అనుభవం ఉన్న యాక్టర్. అయితే ఆమె షూటింగ్ కోసం అడిలైడ్‌కు వచ్చింది. నన్ను కలవొద్దని ఆమెకు చెప్పాను. ఆటపై ఫోకస్ చేయాలనే ఉద్దేశంతో అలా అన్నాను. కానీ ఆమె కాన్‌బెర్రా వరకు నన్ను ఫాలో అయ్యింది. రెండు టెస్టుల్లో నేను పెద్దగా పరుగులు చేయలేదు. దీంతో ఇక్కడ ఏం చేస్తున్నావ్? అన్నట్లుగా అడిగాను. ఆమె 'నీతో సమయం గడపాలని వచ్చా' అని బదులిచ్చింది''

I Was Dating an Actress Told Her Let s Not Meet Yuvraj Singh Shares Untold Story from 2007 08 Australia Tour

''ఆ తర్వాత ఆ రోజు రాత్రి ఆమెను కలిశాను. ఇద్దరం కబుర్లు చెప్పుకున్నాం. కెరీర్‌పై దృష్టిసారించాలని ఆమెతో చెప్పాను. ఆ తర్వాత కాన్‌బెర్రా నుంచి అడిలైడ్‌కు బయలుదేరడానికి సిద్ధమయ్యాం. తాను నా సూట్‌కేస్ ప్యాక్ చేసింది. అయితే ఆమె నా షూ కూడా అందులోనే సర్దింది. నేను ఎలా వెళ్లాలని అడిగితే తన పింక్ స్లిప్పర్లు ఇచ్చింది. ఎయిర్‌పోర్ట్‌ వరకు వాటితోనే ప్రయాణించా. నా బ్యాగ్‌తో వాటిని కవర్ చేయడానికి ట్రై చేశా. అయినా కొందరు చూసి నవ్వారు'' అని యువరాజ్ సింగ్ పేర్కొన్నాడు. అప్పట్లో దీపిక పడుకోణెతో యువరాజ్ డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి.

కాగా, 2007 టీ20 ప్రపంచకప్, 2007 వన్డే వరల్డ్ కప్‌ భారత్ గెలవడంతో యువరాజ్ సింగ్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. టీమిండియా తరఫున యువీ 40 టెస్టులు, 304 వన్డేలు, 58 టీ20లు ఆడాడు.

Story first published: Thursday, September 26, 2024, 13:28 [IST]
Other articles published on Sep 26, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+