Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అదే నా చివరి మ్యాచ్ - వార్నర్ షాకింగ్ కామెంట్స్

ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ టీ20 ఫార్మాట్‌కు కూడా రిటైర్మెంట్ ప్రకటించనున్నట్లు తెలిపాడు. ఈ ఏడాది జూన్‌లో జరగనున్న టీ20 ప్రపంచకప్ అనంతరం అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై పలకనున్నట్లు వెల్లడించాడు. ఇప్పటికే వార్నర్ వన్డే, టెస్టు ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. తాజాగా పొట్టి ఫార్మాట్ రిటైర్మెంట్ గురించి ఆస్ట్రేలియా-వెస్టిండీస్ తొలి టీ20 అనంతరం చెప్పాడు.

''జట్టు విజయంలో కీలకపాత్ర పోషించినందుకు సంతోషంగా ఉంది. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంది. ఇక్కడ భారీ స్కోరు చేయవచ్చు. నాకు సరికొత్తగా, కొత్త ఉత్సాహంతో ఉన్నట్లుగా అనిపిస్తోంది. టీ20 ప్రపంచకప్ ఆడాలని ఉంది. ఆ మెగాటోర్నీతో ముగించాలనుకుంటున్నా. వచ్చే ఆరు నెలలు ఎంతో కీలకం. ఇక ఇదే జట్టుతో న్యూజిలాండ్ పర్యటనకు వెళ్తున్నాం. ఆ సిరీస్ మాకు ఎంతో కీలకం'' అని డేవిడ్ వార్నర్ అన్నాడు.

I want to play the World Cup and finish there - David Warner

జూన్‌లో జరగనున్న టీ20 వరల్డ్ కప్‌నకు అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. కాగా, గత నెలలో వార్నర్ తన వన్డే, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాడు. సొంతగడ్డపై అభిమానుల సమక్షంలో పాకిస్థాన్‌తో జరిగిన సిడ్నీ టెస్టులో సుదీర్ఘ ఫార్మాట్‌కు గ్రాండ్‌గా వీడ్కోలు పలికాడు. ఇక వన్డే ఫార్మాట్‌లో టీమిండియాతో జరిగిన వన్డే ప్రపంచకప్ ఫైనల్ చివరిదిగా వెల్లడించాడు.

కాగా, హోబర్ట్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20లో డేవిడ్ వార్నర్ అరుదైన ఘనత సాధించాడు. క్రికెట్‌లోని మూడు ఫార్మాట్లలో 100 మ్యాచ్‌లు ఆడిన తొలి ఆస్ట్రేలియా ప్లేయర్‌గా చరిత్రకెక్కాడు. అయితే ఓవరాల్‌గా ఈ రికార్డు సాధించిన మూడో ప్లేయర్ వార్నర్. అంతకుముందు అన్ని ఫార్మాట్లలో వేర్వేరుగా 100 మ్యాచ్‌లు ఆడిన రికార్డు ఇద్దరు పేరిట మాత్రమే ఉండేది. స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి, న్యూజిలాండ్ బ్యాటర్ రాస్ టేలర్ ఈ ఘనత సాధించారు. వార్నర్ తన కెరీర్‌లో 112 టెస్టులు, 161 వన్డేలు, 100 టీ20లు ఆడాడు.

అయితే ఈ స్పెషల్ టీ20లో డేవిడ్ వార్నర్ విధ్వంసం సృష్టించాడు. 36 బంతుల్లో 70 పరుగులు సాధించాడు. 12 ఫోర్లు, ఒక సిక్సర్ బాది ఆస్ట్రేలియా విజయంలో కీలకపాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్నాడు. మొదట బ్యాటింగ్‌కు వచ్చిన ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 213 చేసింది. అనంతరం ఛేదనలో వెస్టిండీస్ ఎనిమిది వికెట్లకు 202 పరుగులు చేసి 11 రన్స్ తేడాతో ఓటమిపాలైంది.

Story first published: Friday, February 9, 2024, 18:44 [IST]
Other articles published on Feb 9, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+