న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోహ్లీ సారథ్యంలో ఆడాలనుంది.. వంద వికెట్లు తీయడమే నా లక్ష్యం

I Want to finish career with 100 Test wickets says S Sreesanth

ఢిల్లీ: 100 టెస్ట్ వికెట్లతో కెరీర్ పూర్తి చేయాలనుకుంటున్నా అని కేరళ క్రికెటర్‌, భారత పేస్ బౌలర్‌ శ్రీశాంత్ పేర్కొన్నాడు. విరాట్ కోహ్లీ సారథ్యంలో ఆడాలనుంది అని తన మనసులోని మాటను బయటకు చెప్పాడు. 2013 ఐపీఎల్‌లో స్పాట్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలతో టీమిండియాకు దూరమైన శ్రీశాంత్‌కు తాజాగా ఊరట లభించింది. ఈ వివాదాస్పద పేసర్‌పై భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు (బీసీసీఐ) గతంలో విధించిన జీవితకాల నిషేధాన్ని బీసీసీఐ అంబుడ్స్‌మన్‌ డీకే జైన్‌ ఏడేళ్లకు కుదించాడు. ఇప్పటికే ఆరేళ్ల నిషేధం పూర్తిచేసుకున్న శ్రీశాంత్ శిక్ష 2020 ఆగస్టులో ముగుస్తుంది.

<strong>వరల్డ్ చాంపియన్‌షిప్‌కు 'సుశీల్ కుమార్'!!</strong>వరల్డ్ చాంపియన్‌షిప్‌కు 'సుశీల్ కుమార్'!!

కోహ్లీ సారథ్యంలో ఆడాలనుంది:

కోహ్లీ సారథ్యంలో ఆడాలనుంది:

ఈ సందర్భంగా శ్రీశాంత్ మీడియాతో మాట్లాడుతూ.. 'అంబుడ్స్‌మన్ నిర్ణయంతో చాలా ఆనందంగా ఉన్నా. నా కోసం దేవుడిని ప్రార్థించిన శ్రేయోభిలాషులకి ధన్యవాదాలు. నా ప్రార్ధనలు కూడా ఫలించాయి. ప్రస్తుతం నా వయసు 36. శిక్ష పూర్తయ్యేసరికి 37 ఏళ్లు వస్తాయి. టెస్టుల్లో ఇప్పటి వరకు 87 వికెట్లు తీశాను. 100 వికెట్లు తీసి నా కెరీర్‌ను ముగించాలనుకుంటున్నా. భారత టెస్ట్ జట్టులో తిరిగి స్థానం దక్కించుకుంటాననే నమ్మకం ఉంది. విరాట్‌ కోహ్లీ సారథ్యంలో ఆడాలని ఉంది' అని శ్రీశాంత్‌ తెలిపారు.

అందుకే శిక్ష కాలం తగ్గించాం:

అందుకే శిక్ష కాలం తగ్గించాం:

'శ్రీశాంత్ విచారణకు సహకరించలేదని కమిషనర్ నివేదికలో ఎటువంటి ఆరోపణలు లేవు. మైదానంలో, బయట, తోటి ఆటగాళ్లతో అతని చెడు ప్రవర్తనను చూపించడానికి బీసీసీఐ దగ్గర ఎటువంటి ఆధారాలు లేవు. ఇక శ్రీశాంత్ జాతీయ, అంతర్జాతీయ మ్యాచ్‌లలో పాల్గొనొచ్చు. శ్రీశాంత్ క్రికెట్‌ కెరీర్‌ ఇప్పటికే ముగిసింది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అతడి శిక్ష కాలం తగ్గించాం. 2013లో నిషేధానికి గురైన తేదీ నుంచి శిక్ష అమల్లోకి వస్తుంది' అని జైన్‌ పేర్కొన్నారు.

2013లో జీవితకాల నిషేధం:

2013లో జీవితకాల నిషేధం:

ఐపీఎల్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ తరఫున ప్రాతినిధ్యం వహిస్తూ.. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో తన రెండో ఓవర్‌లో ఉద్దేశపూర్వకంగా 14 పరుగులు ఇచ్చినందుకు రూ.10 లక్షలు తీసుకున్నాడని శ్రీశాంత్‌పై ఆరోపణలు ఉన్నాయి. స్పాట్‌ ఫిక్సింగ్‌కు పాల్పడ్డందుకు శ్రీశాంత్‌తో పాటు అజిత్‌ చండీలా, అంకిత్‌ చవాన్‌లపై బీసీసీఐ 2013లో జీవితకాల నిషేధం విధించింది.

రహానే vs రోహిత్.. కోహ్లీ ఓటు ఎవరికి?

ప్రపంచకప్‌లు గెలిచిన భారత జట్టులో సభ్యుడు:

ప్రపంచకప్‌లు గెలిచిన భారత జట్టులో సభ్యుడు:

తనపై వచ్చే ఆరోపణలు అన్నీ తప్పే అని శ్రీశాంత్‌ మొదటి నుంచి అంటున్నాడు. ఏదేమైనా చివరకు శ్రీశాంత్‌కు ఊరట లభించింది. భారత జట్టు తరఫున శ్రీశాంత్ 27 టెస్టులు, 53 వన్డేలు, 10 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. టెస్టుల్లో 87, వన్డేల్లో 75, టీ20ల్లో ఏడు వికెట్లు తీసాడు. చివరిగా 2011లో టీమిండియాకు ప్రాతినిధ్యం వహించాడు. 2007 టీ20, 2011 వన్డే ప్రపంచకప్‌లు గెలిచిన భారత జట్టులో శ్రీశాంత్‌ ఉన్నాడు.

Story first published: Wednesday, August 21, 2019, 12:14 [IST]
Other articles published on Aug 21, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X