Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'ఒత్తిడిని ఎలా అధిగమించాలో ధోని, బ్రావోల వద్ద నేర్చుకుంటా'

I Want to Pick Brains of Dhoni and Bravo: Mark Wood

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 11వ సీజన్‌లో తాను మ్యాచ్ విన్నర్‌గా మారాలని అనుకుంటున్నానని ఇంగ్లాండ్ పేస్ బౌలర్ మార్క్ ఉడ్ అన్నాడు. అంతేకాదు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని నుంచి చాలా నేర్చుకునేందుకు ఐపీఎల్ ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.

జవవరి 27, 28 తేదీల్లో జరిగిన ఐపీఎల్ వేలంలో మార్క్ ఉడ్‌ని చెన్నై సూపర్ కింగ్స్ ప్రాంఛైజీ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం ఐపీఎల్ గురించి మాట్లాడుతూ 'టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్‌ ధోనీ, వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రావో నుంచి చాలా నేర్చుకునే అవకాశం నాకు ఐపీఎల్‌ ద్వారా దక్కింది' అని అన్నాడు.

'ఒత్తిడిని ఎలా అధిగమించాలో వీరి దగ్గర నుంచి నేర్చుకుంటాను. ధోని నా కెప్టెన్ మాత్రమే కాదు మ్యాచ్ విన్నర్ కూడా. బ్రావో నుంచి బౌలింగ్‌ మెలకువలు నేర్చుకుంటా. వీరిద్దరూ చెన్నై జట్టులో కీలక ఆటగాళ్లు. ఇలాంటి దిగ్గజాల నుంచి నేర్చుకున్న అంశాలు భవిష్యత్తులోనూ ఎంతో ఉపయోగపడతాయి' అని తెలిపాడు.

'ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌ తరఫున ఆడటాన్ని ఎంతో గర్వంగా ఫీలవుతున్నాను. ఐపీఎల్‌లో అత్యుత్తమ జట్టలో ఒకటి. ఈ లీగ్‌లో పోటీ ఎక్కువ. మా జట్టులో నేను కూడా మ్యాచ్‌ విన్నర్‌గా మారాలనుకుంటున్నాను' అని చెన్నై సూపర్ కింగ్స్ వెబ్ సైట్‌కి ఇచ్చిన ఇంటర్యూలో అన్నాడు.

140 కిలోమీటర్ల వేగంతో బంతులు విసర కలిగే మార్క్ ఉడ్ ఒత్తిడిని అధిగమించి రాణించడం క్రికెట్‌లో ఎంతో ముఖ్యమని చెప్పుకొచ్చాడు. ఇక, చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ ఎటాక్‌లో దక్షిణాఫ్రికాకు చెందిన లుంగిడి ఎంగిడి, మార్క్ ఉడ్, శార్దూల్ ఠాకూర్‌లు కీలకపాత్ర పోషించనున్నారు.

Story first published: Friday, March 2, 2018, 17:51 [IST]
Other articles published on Mar 2, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+