Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నా దగ్గర ఎలాంటి వివరణ లేదు: ధోని 'స్లో' బ్యాటింగ్‌పై దాదా చురక

Ive Got No Explanation: Sourav Ganguly at a Loss for Words on Watching Slow MS Dhoni

హైదరాబాద్: ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు ఆటతీరు గురించి చెప్పడానికి తన దగ్గర ఎలాంటి వివరణ లేదని టీమిండియా కెప్టెన్ సౌరవ్ గంగూలీ అన్నాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా 31 పరుగుల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

భారత్-ఇంగ్లాండ్ మ్యాచ్‌కి సౌరవ్ గంగూలీ కామంటెటేర్‌గా వ్యవహారించిన సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌ జరుగుతున్న సమయంలో కామెంట్రీ బాక్స్‌లో ఉన్న ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హుస్సేన్, టీమిండియా మాజీ కెప్టెన్ గంగూలీ మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది.

ధోని-జాదవ్‌ల బ్యాటింగ్‌ తీరుపై నాసిర్ హుస్సేన్ అసహనం వ్యక్తం చేశాడు. తాను పూర్తిగా తికమకకు గురయ్యానని, ఏం జరుగుతుందో తెలియడం లేదని చెప్పుకొచ్చాడు. ఈ తరహా బ్యాటింగ్‌ టీమిండియాకు అవసరం లేదని అన్నాడు. కొంతమంది ఫ్యాన్స్ ఇప్పటికే వెళ్లిపోతున్నారని, ధోనీ నుంచి వాళ్లు ఈ ఆటతీరును ఆశించలేదని, ధోనీ మార్క్ షాట్స్ ఆశించారని అన్నాడు.

అనంతరం గంగూలీ మాట్లాడుతూ ఈ ఆటతీరు గురించి చెప్పడానికి తన దగ్గర ఎలాంటి వివరణ లేదని అన్నాడు. ఆ ప్రశ్న అడిగినప్పటికీ ఈ సింగిల్స్ గురించి తన దగ్గర సమాధానం లేదని చెప్పాడు. ఐదు వికెట్లు చేతిలో ఉండగా 338 పరుగులు చేయలేని స్థితిలో భారత బ్యాట్స్‌మెన్స్ ఉన్నారని గంగూలీ మండిపడ్డాడు.

ధోని సింగిల్స్ తీస్తూ స్లోగా బ్యాటింగ్ చేయడంపై సౌరవ్ గంగూలీ మండిపడ్డాడు. టీమిండియా 300 పరుగులకు ఆలౌట్ అయినా తాను బాధపడేవాడిని కాదని, ఐదు వికెట్లు చేతిలో ఉండగా కూడా ఇలా ఆడటం ఏంటని గంగూలీ ఈ సందర్భంగా ప్రశ్నించాడు.

1
43681

{headtohead_cricket_2_3}

Story first published: Monday, July 1, 2019, 15:37 [IST]
Other articles published on Jul 1, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+