'ధోని వికెట్ల వెనుక ఉన్పప్పుడు నేను బౌలింగ్ చేయాలి'

హైదరాబాద్: శ్రీలంక టీ20మ్యాచ్‌కు ఇండియా తరపున మొట్ట మొదటి సారిగా బౌలర్‌గా ఎంపికైన కేరళ యువ ఫేసర్ బసిల్ థంపి తన ఆనందాన్ని ఇలా పంచుకున్నాడు. తను బౌలింగ్ చేస్తుండగా వికెట్ల వెనుక కీపింగ్ పొజిషన్‌లో ధోని ఉండాలని అది తన చిరకాల వాంఛ అని వాఖ్యానించాడు. గతేడాది బౌలర్‌గా మెరగయ్యాను. ఇండియా తరపున ఆడుతున్నందుకు గర్వంగా ఉందని ఉద్ఘాటించాడు.

అంతేగాక ఎంఆర్‌ఫౌండేషన్‌లో కోచింగ్ తీసుకుంటున్న సమయంలో ఉన్నప్పటి రోజుల్లో ఆస్ట్రేలియా పేస్ బౌలర్ గ్లెన్ మెక్‌గ్రాత్ నుంచి చాలా నేర్చుకున్నానని అభిప్రాయపడ్డాడు. ఆ రోజుల్ని గుర్తు చేసుకుంటూ 'బౌలింగ్ వేగం తగ్గించొద్దు' అని మెక్‌గ్రాత్ సలహా ఇచ్చినట్లు తెలిపాడు.
నైపుణ్యం మెరుగు పడే దిశగా కష్టపడుతున్న దశలో తనకు పౌండేషన్ ప్రధాన కోచ్ సెంథిల్‌రామన్ కూడా ఎంతో సాయపడ్డాడని కృతజ్నతలు తెలిపాడు.ఈ ఏడాది ఐపీఎల్‌లో గుజరాత్ లయన్స్ తరఫున ఆడి 35 మ్యాచుల్లో 37 వికెట్లు తీశాడు. అందుకుగాను బసిల్.. ఉత్తమ వర్దమాన ఆటగాడి అవార్డు అందుకున్నాడు. అంతకుముందు కంటే ఇప్పుడు ఆత్మ విశ్వాసం పెంచుకున్నానని, కచ్చితంగా శ్రీలంకతో జరిగే వన్డేలో విజయం కోసం తను పూర్తి స్థాయిలో కష్టపడేందుకు సిద్ధమన్నాడు. మొట్ట మొదటిసారి టీమిండియా తరపున ఆడుతున్న 24ఏళ్ల ఈ యువ బౌలర్ ఏం చేస్తాడో చూడాలి మరి.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications