న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆత్మవిశ్వాసం పెరిగింది.. మునపటిలా లేను: విరాట్ కోహ్లీ

‘I’ve become more assured of myself’ – Virat Kohli

న్యూఢిల్లీ: విదేశీ పర్యటనలు తమకు సర్వ సాధారణమైపోయాయంటున్నాడు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ. ఆసీస్ గడ్డపై ఆడేటప్పుడు ప్రత్యేకంగా స్పందించడానికి ఏమీ లేదని చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే కోహ్లీ కెప్టెన్సీలో తొలిసారి టీమిండియా ఆస్ట్రేలియాలో టెస్టు‌ సిరీస్‌ గెలిచే అవకాశం ప్రస్తుతం కోహ్లీ ముందుంది. అయితే టెస్టుల్లో ఇప్పటికే 24 సెంచరీ నమోదు చేసిన విరాట్.. తానేంటో ఇప్పుడు కొత్తగా ఎవరికీ, ఏదీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదని అభిప్రాయం వ్యక్తం చేశాడు.

కొత్తగా నిరూపించుకోవాల్సిన అవసర్లేదు

కొత్తగా నిరూపించుకోవాల్సిన అవసర్లేదు

‘ప్రతి సిరీస్‌, పర్యటన, మ్యాచ్‌ ద్వారా ఏదో ఒక కొత్త విషయం నేర్చుకుంటూనే ఉంటాం. గత పర్యటన కన్నా ఇప్పుడు మరింత ఆత్మవిశ్వాసంతో ఉన్నాను. కొత్తగా నేనేంటో నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. జట్టు అవసరాలను తీర్చడమే నా పని. అందు కోసం వంద శాతం కష్టపడతా. వివిధ దేశాల పర్యటన అలవాటుగా మారింది. ఇప్పుడు కొత్తగా ఏమనిపించడం లేదు' అని కోహ్లీ అన్నాడు. డిసెంబరు 6 నుంచి ఆసీస్‌తో తొలి టెస్టు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.

అవన్నీ పట్టించుకునే సమయం లేదు

అవన్నీ పట్టించుకునే సమయం లేదు

ఫీల్డ్‌లో వందశాతం కష్టపడటానికి మాత్రమే ప్రయత్నిస్తానని తెలిపాడు. 'మాపై వస్తున్న ఆరోపణలను పట్టించుకునే సమయం ప్రస్తుతం మాకు లేదు. ఆసీస్‌ జట్టు చాలా దూకుడుగా ఉంటుంది. వాళ్ల దూకుడుకు టీమిండియా ఆటగాళ్లు అడ్డుకట్ట వేయగలరు. నైపుణ్యాల పరంగా, అనుభవం పరంగా, ఆటపరంగా చూస్తే ఇక్కడ సిరీస్‌ గెలిచే సత్తా టీమిండియా'కు ఉంది.

సిరీస్ మొత్తం అదే కొనసాగించాలని

సిరీస్ మొత్తం అదే కొనసాగించాలని

ఆస్ట్రేలియా గత పర్యటనతో పోలిస్తే.. ఇప్పుడు మేం బాగా అనుభవం గడించాం. జట్టు ఆడుతున్న తీరు చూస్తుంటే.. కచ్చితంగా సిరీస్ గెలవగలమనే నమ్మకం ఉంది. అయితే.. కేవలం ఒకటి లేదా రెండు టెస్టులకే మా ఆధిపత్యాన్ని పరిమితం చేయదల్చుకోలేదు. సిరీస్ మొత్తం అదే జోరుని కొనసాగించాలని ఆశిస్తున్నాం. ఇక ఆస్ట్రేలియా టీమ్ గత పర్యటన తరహాలో పెద్ద ఎత్తున కవ్వింపులకి దిగకపోవచ్చు.

 ఎట్టకేలకు వికెట్‌ను ఖాతాలో వేసుకున్న కోహ్లీ

ఎట్టకేలకు వికెట్‌ను ఖాతాలో వేసుకున్న కోహ్లీ

సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగు రోజుల వార్మప్ మ్యాచ్‌లో కోహ్లీ ఎట్టకేలకు సక్సెస్ అయ్యాడు. మూడో రోజు ఆటలో రెండు ఓవర్లు పాటు బౌలింగ్‌ వేసి వికెట్‌ తీయడానికి ప్రయత్నించిన విరాట్ కోహ్లీ.. శనివారం చివరి రోజు ఆటలో ఎట్టకేలకు వికెట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. శనివారం సౌత్‌ ఆస్ట్రేలియా వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ హ్యారీ నీల్సన్‌ను ఔట్‌ చేశాడు.

Story first published: Sunday, December 2, 2018, 15:16 [IST]
Other articles published on Dec 2, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X