
హైదరాబాద్: 2018 జనవరి 1తో ముగిసిన రంజీ సీజన్‌తో చరిత్ర సృష్టించిన విదర్భ విజయోత్సహంలో ఉంది. అనుకోని రీతిలో అంచనాలు లేకుండానే ఫైనల్‌కు చేరింది. ఏడుసార్లు రంజీ ట్రోఫీని గెలిచిన ఢిల్లీ జట్టు ఈ సారి విదర్భ వీర విహారానికి తలొంచింది.
ఈ సిరీస్‌తో వెలుగులోకి వచ్చిన యువ పేసర్ రజ్నీస్ గుర్బానీ. చక్కటి ప్రతిభను కనబర్చి విదర్బ జట్టును ఉన్నత స్థానంలో నిలిపాడు. ఈ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన 24 ఏళ్ల యువ సంచలనం జట్టు తొలిసారి రంజీ టైటిల్ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు.
కర్ణాటకతో జరిగిన సెమీ ఫైనల్లో 12 వికెట్లు సాధించిన గుర్బానీ.. ఢిల్లీతో జరిగిన తుది పోరులో 8 వికెట్లను ఖాతాలో వేసుకున్నాడు. మొత్తంగా చూస్తే ఆరు మ్యాచ్‌లు ఆడిన గుర్బానీ 39 వికెట్లు సాధించాడు. ఫలితంగా ఈ సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా గుర్బానీ నిలిచాడు.
మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ద సిరీస్‌లను కూడా గుర్భానీనే పొందగలిగాడు. అయితే తను మాత్రం వ్యక్తిగత ప్రదర్శన కంటే కూడా జట్టు టైటిల్‌ను కైవసం చేసుకోవడంపై గుర్బానీ ఆనందం వ్యక్తం చేస్తున్నాడు.
' నేను రంజీ ట్రోఫీ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉండాలని తరచు కలలు కనేవాణ్ని. నా కల నెరవేరినందుకు చాలా సంతోషంగా ఉంది. అసలు రంజీ టైటిల్‌ను గెలవడం ఇప్పటికీ నమ్మశక్యంగా లేదు. మా అత్యుత్తమ ప్రదర్శతోనే అది సాధ్యమైంది. రాబోవు మ్యాచ్‌ల్లో కూడా ఇదే ఫామ్‌ను కొనసాగిస్తాం' అని గుర్బానీ తెలిపాడు.
నిన్న ఢిల్లీతో ముగిసిన తుది పోరులో విదర్భ 9 వికెట్ల తేడాతో గెలిచి తొలిసారి రంజీ టైటిల్‌ను సొంతం చేసుకుంది.విదర్భ జట్టు సారథి అయిన ఫైజ్ ఫజల్ మాట్లాడుతూ జట్టులోని సభ్యులు సిరీస్ మొదలైనపప్పుడు కొద్దిగా తడబడ్డారు. ఇప్పుడు అందరూ చక్క,ని ప్రతిభను కనబర్చడంతో గెలిచాం. అని పేర్కొన్నాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.