Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ద్రవిడ్‌ నాకు స్పూర్తి అందుకే రిటైర్ కావద్దన్నాను: పాంటింగ్

Ricky Ponting
మెల్‌బోర్న్: కెరీర్‌లో పేలవమైన ఫామ్‌తో ఉన్నప్పుడు భారత్, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్లు ద్రవిడ్, పాంటింగ్‌లు పరస్పరం ప్రోత్సహించుకున్నారు. తొలుత ద్రవిడ్‌కు పాంటింగ్ ధైర్యం చెప్పాడు. ఆపై 'ది వాల్"... రికీని ఉత్తేజితుణ్ని చేశాడు. గతేడాది వరుసగా విఫలమవుతున్న దశలో కెరీర్ గురించి తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దని ద్రవిడ్‌కు పాంటింగ్ సూచించాడు. తాను కూడా అలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నప్పుడు ద్రవిడ్ నుంచి ప్రోత్సాహం లభించిందని రికీ గుర్తు చేసుకున్నాడు. ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో ప్రధాన బ్యాట్స్‌మెన్ అంతా విఫలమైనప్పటికీ ద్రవిడ్ ఒక్కడే మూడు సెంచరీలతో పాటు మొత్తం 461 పరుగులు సాధించి తన సూపర్ ఫామ్‌ను చాటుకున్న సంగతి తెలిసిందే. అయితే 2010లో అత్యంత పేలవ ఆటతీరుతో ద్రవిడ్ విమర్శలు ఎదుర్కొన్నాడు.

ఈ దశలో అతడి కెరీర్ సంక్లిష్టంలో పడిందని పాంటింగ్ అన్నాడు. 'భారత్‌తో జరిగిన మా గత సిరీస్‌లో ద్రవిడ్ గురించి చాలా కామెంట్స్ విన్నాను. ఇక అతడి పని అయిపోయిందని, క్రికెట్ నుంచి తప్పుకుంటే మేలనే అభిప్రాయాలు వినిపించాయి. సిరీస్ ముగిశాక నేను ద్రవిడ్ దగ్గరికి వెళ్లాను. 'రిటైర్మెంట్ గురించి నీవేమాత్రం ఆలోచించకు" అని చెప్పాను. ఎందుకంటే మాపై ఆడిన కొన్ని ఇన్నింగ్స్‌లలో అద్భుతంగా షాట్లు కొట్టాడు. అందుకే అతనిలో ఇంకా సత్తా ఉన్న విషయం గమనించాను. ఎదుటి వ్యక్తి విమర్శలను పట్టించుకొని నిన్ను నువ్వు తక్కువ చేసుకోకు అని ధైర్యం చెప్పాను. అలాగే యాషెస్ సిరీస్‌కు ముందు, తర్వాత కూడా నేను ఫామ్ కోల్పోయినపుడు ద్రవిడ్ ఇదే తరహా మెసేజ్‌లు పంపాడు" అని పాంటింగ్ వివరించాడు. గత జనవరి నుంచి 36 ఏళ్ల పాంటింగ్ ఒక్క టెస్టు సెంచరీ కూడా చేయలేకపోయాడు. ద్రవిడ్‌ను స్ఫూర్తిగా తీసుకునే ప్రస్తుతం రాణిస్తున్నట్టు చెప్పాడు.
Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+