న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'వచ్చే ఏడాది కోసం ఎంతో ఎదురుచూస్తున్నా.. ఫామ్‌ను ఇలానే కొనసాగిస్తా: రోహిత్

I understand my batting well, want to play within limits says Rohit Sharma


కటక్‌: నా బ్యాటింగ్‌ను పూర్తిగా అర్థం చేసుకున్నా. వచ్చే ఏడాది కోసం ఎంతో ఎదురుచూస్తున్నా. నా ఫామ్‌ను ఇలానే కొనసాగిస్తా అని టీమిండియా ఓపెనర్, 'హిట్‌మ్యాన్‌' రోహిత్‌ శర్మ అన్నారు. వెస్టిండీస్‌తో ఆదివారం జరిగిన చివరిదైన మూడో వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. విండీస్‌ నిర్దేశించిన 316 పరుగుల లక్ష్యంను కోహ్లీసేన ఆరు వికెట్ల కోల్పోయి ఛేదించింది. ఈ సిరీస్ విజయంలో కీలక పాత్ర పోషించిన రోహిత్‌కు 'మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌' అవార్డు దక్కింది.

శార్దూల్‌ ఠాకూర్‌ ఆటకు కోహ్లీ ఫిదా.. హ్యాట్సాఫ్‌ అంటూ ప్రశంసలు!!శార్దూల్‌ ఠాకూర్‌ ఆటకు కోహ్లీ ఫిదా.. హ్యాట్సాఫ్‌ అంటూ ప్రశంసలు!!

 ఫామ్‌ను ఇలానే కొనసాగిస్తా:

ఫామ్‌ను ఇలానే కొనసాగిస్తా:

మ్యాచ్ అనంతరం రోహిత్‌ శర్మ మాట్లాడుతూ... 'ఈ ఏడాది అద్భుతంగా గడించింది. ప్రపంచకప్‌-2019 కూడా గెలిస్తే ఇంకా బాగుండేది. సెమీస్ నిష్క్రమణ బాధించింది. వచ్చే ఏడాది కోసం ఎంతో ఎదురుచూస్తున్నా. నా బ్యాటింగ్‌ను పూర్తిగా అర్థం చేసుకున్నా. ఫామ్‌ను ఇలానే కొనసాగిస్తా. పరుగులు చేయడానికే ప్రయత్నిస్తా. అయితే ప్రణాళికను అమలు చేయడం ఎంతో ముఖ్యం. మైదానంలోకి దిగిన తర్వాత ఎన్నో సవాళ్లు ఎదురవుతాయి. దైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగాలి' అని అన్నారు.

పుల్‌షాట్‌ను ఎంతో ఆస్వాదించా:

పుల్‌షాట్‌ను ఎంతో ఆస్వాదించా:

'కటక్‌ పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలం. ఈ మ్యాచ్‌లో ఎక్కువసేపు బ్యాటింగ్‌ చేయనందుకు కాస్త నిరాశకు గురయ్యాను. కానీ.. కేఎల్ రాహుల్‌, విరాట్ కోహ్లీ అద్భుతంగా ఆడారు. పేసర్ శార్దూల్ ఠాకూర్‌ బాగా ఆడాడు. అతడు ఆడిన పుల్‌షాట్‌ను ఎంతో ఆస్వాదించా. జట్టుకు ఆ సమయంలో అది ఎంతో అవసరం. రవీంద్ర జడేజా మంచి సహకారం అందించాడు' అని రోహిత్‌ పేర్కొన్నారు.

ఈ ఏడాది బాగా కలిసొచ్చింది:

ఈ ఏడాది బాగా కలిసొచ్చింది:

వెస్టిండీస్‌పై మూడో వన్డేలో విజయం సాధించడంతో మూడు వన్డేల సిరీస్‌ను భారత్ 2-1తో కైవసం చేసుకుంది. రోహిత్ విశాఖ వన్డేలో భారీ సెంచరీ (159) చేయగా.. కటక్‌ మ్యాచ్‌లోనూ హాఫ్ సెంచరీ (63) రాణించాడు. చెన్నై మ్యాచ్‌లో 36 పరుగులు చేసాడు. టీ20 సిరీస్‌లో 8, 15, 71 పరుగులు చేసాడు. ఈ ఏడాది రోహిత్‌కు బాగా కలిసొచ్చింది. ప్రపంచకప్‌లో ఐదు సెంచరీలు చేయడంతో పాటు టెస్టుల్లో ఓపెనర్‌గా అద్భుతంగా రాణించాడు. కూతురు పుట్టిన శుభవేళ ఏడాదంతా రోహిత్‌ ఆకట్టుకున్నాడు.

Story first published: Monday, December 23, 2019, 13:08 [IST]
Other articles published on Dec 23, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X