కోల్‌కతా: ఆసియా కప్ ఫైనల్లో భారత జట్టు బంగ్లాదేశ్‌తో తలబడింది. భారత్ బ్యాటింగ్ ఆర్డర్లో కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ నాలుగో స్థానంలో వచ్చి బ్యాట్ ఝులిపించాడు. దీనిపై హర్భజన్ సింగ్ మాట్లాడాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేయమని తానే ధోనీకి చెప్పానని పేర్కొన్నాడు.
ఫైనల్ మ్యాచ్‌లో మహేంద్ర సింగ్ ధోనీ ఆరు బంతుల్లో 20 పరుగులు చేశాడు. అందులో రెండు సిక్స్‌లు ఉన్నాయి. విన్నింగ్ షాట్ సిక్స్‌తో ధోనీ భారత్‌ను గెలిపించడంతో పాటు ఆసియా కప్‌ను దక్కేలా చేశాడు. నాలుగో స్థానంలో వెళ్లిన ధోనీ ధాటిగా ఆడాడు.

దీనిపై హర్బజన్ సింగ్ మాట్లాడుతూ.. హార్దిక్ పటేల్‌ను పంపించాలనుకుంటున్నానని ధోనీ తనతో చెప్పాడని, దానికి తాను మాత్రం వద్దని చెప్పానని, ప్రపంచంలో నువ్వే బెస్ట్ ఫినిషర్ కాబట్టి.. నీవే వెళ్లమని సూచించానని బజ్జీ చెప్పాడు.
భజ్జీ ఇంకా మాట్లాడుతూ... సీనియర్ల నుంచి తాను ఎంతో నేర్చుకున్నానని, వారి సహకారం వల్ల ఉన్నత ఆటగాడిగా ఎదిగానని, నేను జూనియర్లతో అలాగే ఉంటానని, వారికి తన అనుభవాలను షేర్ చేస్తానని చెప్పాడు. ప్రపంచ కప్ కచ్చితంగా గెలుచుకుంటామని చెప్పాడు.