
బ్యాట్ పట్టుకోలేనంత తీవ్రమైన నొప్పి
"బ్యాట్ పట్టుకోలేనంత తీవ్రమైన నొప్పి కానప్పటికీ దానిని అనుభవపూర్వకంగా తెలుసుకోవాలని చెప్పేవాడిని. మిమ్మల్ని ఓ గదిలో వేసి, దానిని తలుపులు మీరు తెరవకపోయి ఉండే పరిస్థితి ఎలా ఉంటుందో... నా పరిస్థితి కూడా అలా ఉండేది. గాయం నుంచి కోలుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశా. టెస్టు ఆడే ముందు రోజూ ఉదయాన్నే ఇంజెక్షన్ తీసుకునేవాడిని" అని సచిన్ చెప్పుకొచ్చాడు.

అది ఏమీ పని చేయలేదు
"కానీ, అది ఏమీ పని చేయలేదు. వైద్యుల సలహా మేరకు ఆపరేషన్ చేయడమే ఉత్తమమని తెలిసి ఆ నిర్ణయం తీసుకున్నా. ఆపరేషన్ అనగానే ఎంతో నిరాశకు గురయ్యాను. నా ఫిజియో స్నేహితులు మరియు వైద్యులు అందరూ ప్రయత్నించారు. అయితే, కొన్ని పనులు చేయవలసి వచ్చింది" అని సచిన్ ఈ సందర్భంగా తెలిపాడు.

అసహనానికి గురయ్యా
"ఆ తర్వాత నేను అసహనానికి గురయ్యానని భావించా. ఎలాగైనా తిరిగి మైదానంలోకి అడుగుపెట్టాలని భావించా. సర్జరీ తర్వాత నేను బ్యాట్ పట్టడానికి కూడా వీలయ్యేది కాదు. అప్పుడు నేను ఎంతో నిరాశ చెందా. రాత్రి సమయాల్లో నిద్ర పట్టేది కాదు. అర్ధరాత్రి 2 గంటలకు, తెల్లవారుజామున 4 గంటలకు నా స్నేహితులకు ఫోన్ చేసి డ్రైవ్‌కు వెళ్దామని చెప్పేవాడిని. వాళ్లు కూడా నాతో కలిసి బయటకు వచ్చేవారు" అని సచిన్ చెప్పుకొచ్చాడు.

నా భార్య అంజలి, ఆమె తల్లిదండ్రులు
"అదే సమయంలో నా భార్య అంజలి, ఆమె తల్లిదండ్రులు ఎంతో మద్దతుగా నిలిచారు. వాస్తవానికి అంజలి.. క్రికెట్ విషయాలపై దృష్టి పెట్టడానికి నా జీవితంలో జరిగిన మంచి విషయాలను గుర్తు చేసుకోమని నిరంతరం చెప్పేది. ఒకరోజు కొంతమంది పిల్లలు ప్లాస్టిగ్ బంతి, బ్యాట్‌తో ఆడుతున్నప్పుడు నేను కూడా వారితో జత కలిశా. ఆ సమయంలో నాకు నా ఎల్బో గాయాన్ని గుర్తుకు తెచ్చింది" అని సచిన్ అన్నాడు.

నేను మళ్ళీ ప్లాస్టిక్ బ్యాట్‌తో
"ఎందుకంటే నేను మళ్ళీ ప్లాస్టిక్ బ్యాట్‌తో ఆడటం మొదలుపెట్టాను. బంతిని నేను బలంగా కొట్టలేకున్నా. 3.5 నెలల తర్వాత నేను బయటకు వెళ్లినప్పుడు 12 ఏళ్ల పిల్లలు కవర్ డ్రైవ్‌లను ఆపడం చూశాను. ఆ సమయంలో నా కెరీర్ అయిపోయిందనుకున్నా. ఆ సమయంలో దేవుడిని ఒకటే కోరుకున్నా. ఇలా అర్ధాంతరంగా నా కెరీర్‌ను ముగించకు, తిరిగి మైదానంలో అడుగుపెట్టేలా దీవించాలని అడిగా" అని సచిన్ తెలిపాడు.

నాగ్‌పూర్ వేదికగా శ్రీలంకతో జరిగిన వన్డేలో
"ఆ తర్వాత 4.5 నెలలకు తిరిగి మైదానంలో అడుగుపెట్టాను. నాగ్‌పూర్ వేదికగా శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్‌లో బరిలోకి దిగా. ఆ అనుభూతిని ఎప్పటికీ మరిచిపోలేను. ఆ సమయంలో ఆకాశం వైపు చూస్తూ దేవుడికి కృతజ్ఞత చెప్పాను. నేను కోరుకున్నది ఇదే (పిచ్‌లోకి తిరిగి రావడానికి)" అని సచిన్ నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు.


Click it and Unblock the Notifications












