Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'లంకతో పోలిస్తే మేము తోపు, మంచి పోజిషన్‌లో ఉన్నాం'

We Are Favourites Over Sri Lanka Says Bangla Allrounder Mosaddek Hossain || Oneindia Telugu
I think we are favourites against Sri Lanka, says Bangladeshs Mosaddek Hossain

హైదరాబాద్: శ్రీలంకతో పోలిస్తే అన్ని విభాగాల్లో తమ జట్టే బలంగా ఉందని బంగ్లాదేశ్‌ ఆల్‌రౌండర్‌ మొసాద్దెక్‌ హొసేన్‌ అన్నాడు. ప్రపంచకప్ ముగిసిన తర్వాత బంగ్లాదేశ్ త్వరలో శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో భాగంగా ఆతిథ్య జట్టుతో బంగ్లాదేశ్ మూడు వన్డేల సిరీస్‌ ఆడనుంది.

ఈ నేపథ్యంలో మొసాద్దెక్‌ హొసేన్‌ మాట్లాడుతూ "శ్రీలంకతో పోలిస్తే మా జట్టే ఫేవరేట్. బ్యాటింగ్, బౌలింగ్‌తో పోలిస్తే మేము మంచి పోజిషన్‌లో ఉన్నాం. ఇక, ఎక్స్‌పీరియన్స్ విషయానికి వస్తే అందులో సైతం మేమే బెటర్ పొజిషన్‌లో ఉన్నాం" అని తెలిపాడు. లంక పర్యటనలో ఆల్‌రౌండర్‌ షకిబ్‌ అల్‌ హసన్‌కు విశ్రాంతినిచ్చారు.

ఇక, బౌలర్‌ మహ్మదుల్లా చేతికి గాయమైన నేపథ్యంలో అతడు బౌలింగ్‌ చేసే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో వారిద్దరి స్థానాల్ని తాను చక్కగా వినియోగించుకుంటానని, అందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆల్‌రౌండర్‌ మొసాద్దెక్‌ హొసేన్‌ అన్నాడు. సరైన ప్రణాళికతో ఉన్నానని, తనకు అందివచ్చే అవకాశాల్ని సద్వినియోగం చేసుకుంటానని చెప్పాడు.

బ్యాటింగ్‌లో మాత్రం తాను ప్రపంచకప్‌లో ఆడిన ఏడో నంబర్‌లో స్థానంలోనే ఆడతానని తెలిపాడు. జట్టు అవసరాలకు తగ్గట్టు ఆడి మంచి ప్రదర్శన చేస్తానని అన్నాడు. కాగా, ఇరు జట్ల మధ్య ఇప్పటివరకూ ఏడు ద్వైపాక్షిక సిరీస్‌లు జరగ్గా అందులో లంక జట్టు ఐదు సిరీస్‌లు గెలిచింది. మరో రెండు సిరీస్‌లు డ్రాగా ముగిశాయి.

Story first published: Saturday, July 20, 2019, 12:28 [IST]
Other articles published on Jul 20, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+