Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రోహిత్xహార్దిక్ గొడవలే ముంబై ఓటమికి కారణం- మాజీ క్రికెటర్

ఐపీఎల్‌లో అత్యంత బలమైన జట్లలో ముంబై ఇండియన్స్ ఒక్కటి. అయిదు సార్లు ఛాంపియన్‌గా నిలిచింది. కానీ ఐపీఎల్-2024లో మాత్రం ముంబై పేలవ ప్రదర్శన చేస్తోంది. సీజన్ ఆరంభంలో ఆలస్యంగా గెలుపు రుచి చూసిన ముంబై తాజాగా మరోసారి హ్యాట్రిక్ పరాజయాల్ని చవిచూసింది. పది మ్యాచ్‌లు ఆడిన హార్దిక్ సేన కేవలం మూడు విజయాలతో పాయింట్ల పట్టికలో అట్టడుగున నుంచి రెండో స్థానంలో నిలిచింది.

రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్య, జస్‌ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషాన్, తిలక్ వర్మ వంటి స్టార్ ప్లేయర్లు ముంబై జట్టులో ఉన్నారు. అయినప్పటికీ గెలుపురుచి చూడటానికి తీవ్రంగా కష్టాలు పడాల్సి వస్తోంది. అయితే ముంబై ఓటమికి రోహిత్-హార్దిక్ గొడవలే కారణమని ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ మైకేల్ క్లార్క్ పరోక్షంగా సంచలన వ్యాఖ్యలు చేశాడు. ముంబై జట్టు గ్రూప్‌లుగా విడిపోయిందని ఆరోపించాడు.

I think there are different groups inside Mumbai Indians- Michael Clarke

ట్రేడింగ్‌లో భాగంగా గుజరాత్ టైటాన్స్ నుంచి హార్దిక్ పాండ్య తిరిగి ముంబై గూటికి చేరిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అయిదు టైటిళ్లు సాధించిన రోహిత్‌ను కాదని హార్దిక్‌కు జట్టు పగ్గాలను ముంబై ఫ్రాంచైజీ అప్పగించింది. ఈ నిర్ణయం ముంబై జట్టులో ప్రకంపనలు సృష్టించింది. రోహిత్‌కు మద్దతుగా బుమ్రా, సూర్య, తిలక్ వర్మ ఓ గ్రూప్‌గా, హార్దిక్‌కు అండగా ఇషాన్ కిషన్ మరో గ్రూప్‌గా ఏర్పడ్డారని కథనాలు వచ్చాయి. ఈ విషయాన్ని మైకేల్ క్లార్క్ బహిరంగంగా ప్రస్తావించాడు.

''ముంబై ఇండియన్స్ జట్టు లోపల మనం ఊహించింన దానికంటే చాలా జరుగుతుందని అనిపిస్తోంది. ఎంతోమంది గొప్ప ప్లేయర్లు నిలకడగా ఆడట్లేదు. నాకు తెలిసి ముంబై డ్రెస్సింగ్ రూమ్‌లో గ్రూప్‌లు ఉన్నాయి. అదే ముంబైను దెబ్బతీస్తుందనిపిస్తోంది. వాళ్లు సమష్టిగా ఉండట్లేదు. జట్టుగా ఆడట్లేదు. వ్యక్తిగత ప్రదర్శన దీన్ని అధిగమించలేదు'' అని క్లార్క్ అన్నాడు.

కాగా, ముంబై ఇండియన్స్ తొమ్మిదో స్థానంలో ఉన్నప్పటికీ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించే అవకాశాలు ఇంకా ఉన్నాయి. మిగిలిన నాలుగు మ్యాచ్‌ల్లో విజయం సాధిస్తే ముంబై 14 పాయింట్లతో గ్రూప్ స్టేజ్‌ను ముగుస్తోంది. ఇతర జట్ల కంటే మెరుగైన రన్‌రేట్ ఉంటే ముంబై తదుపరి దశకు చేరే అవకాశాలు మెరుగ్గా ఉంటాయి.

Story first published: Wednesday, May 1, 2024, 16:28 [IST]
Other articles published on May 1, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+