న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

తండ్రి మరణమే నా ఆటతీరును మార్చేసింది: కోహ్లీ

Virat Kohli Says I Think I Became Much More Focussed After My Father's Left
I think I became much more focussed after my fathers death: Virat Kohli

దుబాయి: భారత జట్టు క్రికెటర్లలో ఇటీవలే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రత్యేక గుర్తింపు పొందాడు. ఇంతకుముందు ఇలాంటి అవార్డు అందుకున్న వారి జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. క్రీడా ప్రముఖులకు అందజేసే రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు నామినేషన్‌కు ఎంపికై ఎట్టకేలకు అందుకునేందుకు అర్హత సాధించాడు. ఈ అవార్డును సచిన్ టెండూల్కర్(1997-98), మహేంద్ర సింగ్ ధోనీ(2007)లోనూ అందుకోగా ఇప్పుడు అదిద విరాట్ వంతైంది.

<strong>టీమిండియాను హెచ్చరించిన రాహుల్ ద్రవిడ్ </strong>టీమిండియాను హెచ్చరించిన రాహుల్ ద్రవిడ్

ఇటీవలే ఓ కార్యక్రమంలో పాల్గొన్న విరాట్ తన తండ్రిని గుర్తు చేసుకున్నాడు. అతని నాన్న మరణించిన తర్వాతే తాను క్రికెట్‌పై మరింత శ్రద్ధ పెట్టానని భారత క్రికెట్‌ స్టార్‌ విరాట్‌ కోహ్లి అన్నాడు. 'నా కళ్ల ముందే అంతా జరిగిపోయింది. తెల్లవారుజాము 3 గంటల సమయం అనుకుంటా. రంజీ ట్రోఫీ మ్యాచ్‌ ఆడుతూ అంతకుముందు రోజు 40 పరుగులతో నాటౌట్‌గా నిలిచాను. నిద్ర సరిగా పట్టలేదు. ఉదయాన్నే లేచి మళ్లీ మ్యాచ్‌ కోసం సిద్ధం అయ్యే పనిలో ఉన్నా.'

'ఆ సమయంలోనే నాన్నకు గుండెపోటు వచ్చింది. ఆసుపత్రికి తీసుకెళ్లడానికి మా పక్కింటి వాళ్ల సాయం తీసుకోవడానికి ప్రయత్నించాం. కానీ ఆ సమయంలో ఎవరూ సరిగా స్పందించలేదు. అంబులెన్స్‌ వచ్చేసరికే అంతా అయిపోయింది. నాన్న మరణం తర్వాతే ఆటపై మరింత దృష్టి పెట్టా. మా నాన్న కలను, నా కలను నెరవేర్చుకోవడానికి సర్వశక్తులూ ఒడ్డా. నేనీ స్థితిలో ఇలా ఉన్నానంటే ఆనాటి ఆ సంఘటనే కారణం' అని ఒక టీవీ కార్యక్రమంలో కోహ్లి చెప్పాడు.

అప్పుడు కోహ్లి వయస్సు పద్దెనిమిదేళ్లు. ఆ రోజు మ్యాచ్‌కు కోహ్లి రాడనే అతడి జట్టు సహచరులు భావించారట. ఐతే కర్ణాటకతో మ్యాచ్‌ ఆడిన కోహ్లి 90 పరుగులు చేయడంతో పాటు.. ఢిల్లీని ఫాలోఆన్‌ గండం నుంచి తప్పించాడు.

Story first published: Monday, September 24, 2018, 11:28 [IST]
Other articles published on Sep 24, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X