Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మురళీ విజయ్ నా భార్య.. శిఖర్ ధావన్ సంచలన వ్యాఖ్యలు!!

I tell Murali Vijay he is like my wife says Shikhar Dhawan

న్యూఢిల్లీ: టీమిండియా సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ ఎంతో హాస్య చతురత కలిగి ఉంటాడు. డ్రెస్సింగ్ రూంలో కూడా తన చలాకి తనంతో సహచరులను తనదైన శైలిలో నవ్విస్తాడు. ఈ క్రమంలో టీమిండియా మరో సీనియర్ ఓపెనర్ మురళీ విజయ్‌తో తనకున్న కెమిస్ట్రీపై తాజాగా ఫన్నీ కామెంట్లు చేసాడు. విజయ్‌తో మైదానంలో, వెలుపల తన కెమిస్ట్రీ చాలా బాగుంటుందన్నాడు. విజయ్ చాలా క్లోజ్ అని, ఇంకా చెప్పాలంటే అతడు తనకు భార్యలాగే అని ధావన్ పేర్కొన్నాడు.

బ్యాటింగ్ చేయడానికి ఎదురుచూస్తున్నా:

బ్యాటింగ్ చేయడానికి ఎదురుచూస్తున్నా:

ఇన్‌స్టాగ్రామ్‌లో 'రెమినిస్ విత్ యాష్' తాజా ఎపిసోడ్‌లో సీనియర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌తో శిఖర్ ధావన్ మాట్లాడి పలు విషయాలు పంచుకున్నాడు. ఈ క్రమంలోనే ఫ్రెండ్‌షిప్‌ గురించి చర్చ వచ్చింది. దాంతో.. 2013లో తన టెస్ట్ అరంగేట్రంలో మురళీ విజయ్‌తో కలిసి 289 పరుగుల ఓపెనింగ్ స్టాండ్‌ను ధావన్ గుర్తుచేసుకున్నాడు. 'విజయ్‌తో కలిసి ఓపెనింగ్ బ్యాటింగ్ చేయడం చాలా ఇష్టం. అతనితో బ్యాటింగ్ చేయడానికి ఎదురుచూస్తున్నా' అని గబ్బర్ అన్నాడు. విజయ్-ధావన్ 24 టెస్టులలో కలిసి ఆడారు. కొన్ని అద్భుత ఓపెనింగ్ భాగస్వామ్యాలను కలిగి ఉన్నారు.

విజయ్ నాకు భార్య లాగే:

విజయ్ నాకు భార్య లాగే:

విజయ్‌తో ఉన్న కెమిస్ట్రీ గురించి శిఖర్ ధావన్ మాట్లాడుతూ... 'మురళీ విజయ్ నాకు చాలా క్లోజ్. అతడు మంచి మనసు వ్యక్తి. ఇంకా చెప్పాలంటే విజయ్ నాకు భార్య లాగే. మైదానంలోనే కాదు వెలుపల కూడా మా కమ్యూనికేషన్ బాగుంటుంది. వికెట్ల మధ్య పరుగు తీసే సమయంలో కొన్ని సందర్భాల్లో మేము గొడవపడతాం. అయితే వెంటనే సర్దుకుంటాం. ఓపిక, సహనం ఉంటే తప్ప.. విజయ్‌ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఏదేమైనా విజయ్‌తో కలిసి ఓపెనింగ్ చేయడాన్ని బాగా ఆస్వాదిస్తా' అని శిఖర్ ధావన్ తెలిపాడు.

హిందీలో బాగా మాట్లాడుతా:

హిందీలో బాగా మాట్లాడుతా:

'కొన్నిసార్లు విజయ్ ఏదో చెప్పినప్పుడు ఆ సమయంలో నాకు అర్థం కాదు. కానీ 1-2 సంవత్సరాల తరువాత అతను చెప్పినదాన్ని గుర్తుచేసుకున్నప్పుడు అప్పుడు అర్థమవుతుంది. నాలో మంచి హాస్యం ఉంది. హిందీలో బాగా మాట్లాడగలుగుతా. నా హిందీ టైమింగ్ మరియు హాస్యం బాగుంటాయి. రిటైర్మెంట్ అనంతరం నాకు చాలా ఎంపికలు ఉన్నాయి. మోటివేషనల్ స్పీకర్ కూడా కాగలను. రోడ్డు మీద ఎవరు ఫ్లూట్ వాయించినా వినేవాడిని. ఆన్‌లైన్ క్లాసులు కూడా తీసుకుంటున్నా. క్రికెటర్లు సమయం లేదని చెపుతారు. కాని మాకు ఎంతోకొంత ఖాళీ సమయం ఉంటుంది. ప్రతిఒక్కరికీ ఒక అభిరుచి ఉండాలి. ఇది మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది. అది చాలా ముఖ్యం' అని గబ్బర్ చెప్పుకొచ్చాడు.

 ఆస్ట్రేలియా పర్యటనలో పేలవ ఫామ్:

ఆస్ట్రేలియా పర్యటనలో పేలవ ఫామ్:

2018 ఆస్ట్రేలియా పర్యటనలో పేలవ ప్రదర్శనతో నిరాశపరిచిన మురళీ విజయ్ వేటుకి గురయ్యాడు. ఆ తర్వాత దేశవాళీ క్రికెట్, ఐపీఎల్‌లోనూ చెప్పుకోదగ్గ ప్రదర్శన కనబర్చలేకపోవడంతో మళ్లీ భారత జట్టులోకి రీఎంట్రీ ఇవ్వలేకపోయాడు. మరోవైపు శిఖర్ ధావన్ కూడా గతేడాది నుంచి గాయాలు, పేలవ ఫామ్ కారణంగా టెస్టులకి దూరమయ్యాడు. ఇక టెస్టు ఓపెనింగ్ స్థానం కోసం పోటీ పతాక స్థాయికి చేరింది. గత ఏడాది వరకూ టెస్టుల్లో మిడిలార్డర్‌లో ఆడిన రోహిత్ శర్మ ఓపెనర్‌గా సక్సెస్ అవ్వడంతో.. మరో స్థానం కోసం మయాంక్ అగర్వాల్, పృథ్వీ షా, శుభమన్ గిల్, శిఖర్ ధావన్ పోటీ పడుతున్నారు.

Story first published: Tuesday, May 26, 2020, 12:29 [IST]
Other articles published on May 26, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+