హస్సీ గతే: నిరాశతో సంచలన వ్యాఖ్యలు చేసిన ఫించ్
హైదరాబాద్: ఆరోన్ ఫించ్ గత వారంలో ఓ రికార్డు బద్దలు కొట్టాడు. ఒక్క టెస్టు మ్యాచ్ కూడా ఆడకుండా వందకు పైగా పరిమిత ఓవర్ల క్రికెట్ (వన్డేలు, ట్వంటీ 20లు కలిపి) ఆడాడు. అయితే తన చిరకాల వాంఛ మాత్రం అలానే ఉండిపోయిందని ఆరోన్ ఫించ్ ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు.
అంతేకాదు ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు డేవిడ్ హస్సీ గతే తనకు పడుతుందేమోనంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. డేవిడ్ హస్సీ ఆస్ట్రేలియా తరుపున 108 మ్యాచులు (వన్డేలు, ట్వంటీ 20లు కలిపి) ఆడినా టెస్టుల్లో మాత్రం అరంగేట్రం చేయలేకపోయాడు.

బ్యాగీ గ్రీన్ క్యాప్ ధరించే అవకాశం రాలేదు
అచ్చం అలాగే ఫించ్ కూడా తనకు టెస్టుల్లో బ్యాగీ గ్రీన్ క్యాప్ ధరించే అవకాశం రాలేదని నిరాశ చెందుతున్నాడు. 79 వన్డేలు, 28 ట్వంటీ20 మ్యాచ్‌లలో ఆస్ట్రేలియా జట్టుకు కెప్టెన్‌గా ఆరోన్ ఫించ్ వ్యవహరించాడు.

ఏమాత్రం హ్యాపీగా లేను
గత కొన్నేళ్లుగా ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో తన మెరుగైన ఆటతీరుతో, పరుగులతో రాణిస్తున్నా అవకాశం దక్కడం లేదని వాపోతున్నాడు. కేవలం పరిమిత ఓవర్ల క్రికెట్ కే తన టాలెంట్ పరిమితం కావడంతో తాను ఏమాత్రం హ్యాపీగా లేనని స్పష్టంచేశాడు.

ఫిబ్రవరి 23 నుంచి భారత్, ఆసీస్‌ల మధ్య తొలి టెస్టు
నాలుగు టెస్టుల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఫిబ్రవరి 23వ తేదీన పూణెలో తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఈ టెస్టు సిరిస్‌కు కూడా ఫించ్ ఎంపిక కాలేదు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో గత మూడేళ్లలో 54.53 యావరేజిని సొంతం చేసుకున్నాడు.

ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఫించ్ యావరేజి 27.47
అయితే మొత్తంగా చూస్తే ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఫించ్ యావరేజి 27.47గా ఉంది. విక్టోరియా జట్టు తరఫున మూడో స్థానంలో బ్యాటింగ్ ఛాన్స్ రావడంతో ఆటతీరు ఎంతో మెరుగైంది. ఓపెనింగ్ స్ధానాల్లో బ్యాటింగ్‌కు రావడంతో మెరుగ్గా రాణించేందుకు అవకాశం ఉందని ఫించ్ పేర్కొన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications