గర్వంగా ఉంది: దీపక్ చాహర్ అత్యుత్తమ ప్రదర్శనపై సోదరి భావోద్వేగం! (వీడియో)

హైదరాబాద్: తన సోదరుడి ప్రదర్శన పట్ల గర్వంగా ఉందని టీమిండియా పేసర్ దీపక్ చాహర్ సోదరి మాల్తీ చాహర్ తన ఇనిస్టాగ్రామ్ పోస్టులో పేర్కొంది. నాగ్‌పూర్ వేదికగా ఆదివారం బంగ్లాదేశ్‌తో ముగిసిన మ్యాచ్‌లో పేసర్ దీపక్ చాహర్ ఆరు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే.
దీంతో మూడు టీ20ల సిరిస్‌ను టీమిండియా 2-1తో కైవసం చేసుకుంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టులో శ్రేయస్ అయ్యర్ (62), కేఎల్ రాహుల్ (52) హాఫ్ సెంచరీలతో రాణించడంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసింది.
అనంతరం చేధనకు దిగిన బంగ్లాదేశ్ దీపక్ చాహర్ (6/7), శివమ్ దూబె (3/30) ధాటికి 19.2 ఓవర్లలో 144 పరుగులకే ఆలౌటైంది. ఈ మ్యాచ్‌లో దీపక్ చాహర్ 3.2-0-7-6 తన కెరీర్‌లోనే అత్యుత్తమ గణాంకాలను నమోదు చేశాడు. శ్రీలంక ఆటగాడు అజంతా మెండిస్ (6/8; 2012లో జింబాబ్వేపై) రికార్డును బద్దలు కొట్టాడు.
ఆరు వికెట్లు తీయడంతో పాటు అంతర్జాతీయ టీ20ల్లో హ్యాట్రిక్ తీసిన భారత ఏకైక బౌలర్‌గా దీపక్ చాహర్ నిలిచాడు. మొత్తం మీద 12వ బౌలర్ కావడం విశేషం. దీపక్ చాహర్ అద్భుత ప్రదర్శనపై అతడి సోదరి మాల్తీ చాహర్ తన ఇనిస్టాగ్రామ్‌లో " చాలా గర్వంగా ఉంది.... అంతర్జాతీయ టీ20లో హ్యాట్రిక్‌తో పాటు కెరీర్‌లోనే అత్యుత్తమ గణాంకాలు 3.2-0-7-6. OMG.. నేను ఇంకా గూస్‌బంప్స్‌ను కలిగి ఉన్నాను. లవ్ యు బ్రదర్" అంటూ వీడియోని పోస్టు చేసింది.
బంగ్లాదేశ్‌తో జరిగిన మూడు టీ20ల సిరిస్‌లో దీపక్ చాహర్ మొత్తం 8 వికెట్లు తీశాడు. ఒక్క ఆఖరి టీ20లోనే ఆరు వికెట్లు తీయడం విశేషం. ఒక ద్వైపాక్షిక సిరిస్‌లో ఓ భారత పేసర్ పడగొట్టిన అత్యధిక వికెట్లు ఇవే. గతంలో సఫారీలతో జరిగిన ఓ మ్యాచ్‌లో భువనేశ్వర్ కుమార్ నమోదు చేసిన 7 వికెట్ల రికార్డుని దీపక్ చాహర్ అధిగమించాడు.
2016లో శ్రీలంకతో జరిగిన మూడు టీ20ల సిరిస్‌లో అశ్విన్ 9 వికెట్లు పడగొట్టాడు. స్వదేశంలో ఓ ద్వైపాక్షిక సిరిస్‌లో భారత బౌలర్ పడగొట్టిన అత్యధిక వికెట్లు ఇవే కావడం విశేషం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications