Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నాకు ఇల్లు లేదు.. బస్‌లోనే ఉంటా: చిన్నారితో ధోని (వీడియో)

I stay in a bus, dont have a home: MS Dhoni tells little girl. Watch

హైదరాబాద్: ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక కాకపోవడంతో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ప్రస్తుతం కుటుంబ సభ్యులతో సరదాగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇటీవలే తన కూతురు జీవాతో కలిసి డ్యాన్స్ ప్రాక్టీస్ చేసిన వీడియోని అభిమానులతో పంచుకున్న సంగతి తెలిసిందే.

అయితే, తాజాగా ధోని మరో వీడియోని తన ఇనిస్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేశాడు. ఇటీవల ధోనీ ఓ కార్యక్రమానికి హాజరయ్యాడు. ఇందులో భాగంగా అక్కడకు వచ్చిన ఓ చిన్నారిని ఎత్తుకుని కాసేపు ముచ్చటించాడు. ఆ చిన్నారి 'మీరెక్కడ ఉంటారు?' అని ధోనీని అడిగింది.

దీనికి వెంటనే ధోనీ సమాధానమిస్తూ 'నాకు ఇల్లు లేదు.. నేను బస్‌లోనే ఉంటాను' అని చెప్పడం అక్కడ ఉన్న అందరినీ నవ్వులు పూయించింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.

కొన్ని రోజుల క్రితం జీవాకు సంబంధించిన వీడియోని ధోని తన సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు. ఆ వీడియోలో జీవా కొరియోగ్రాఫర్‌గా మారగా ధోని డ్యాన్స్ నేర్చుకున్నాడు. "మేం డ్యాన్స్‌ వేస్తున్నప్పుడు కూడా బాగానే ఉంది" అనే కామెంట్‌తో ధోని వీడియోని తన ఇనిస్టాగ్రామ్ ఖాతాలో పంచుకున్నాడు.

ఓ ఇంగ్లిష్ పాటకు జీవా స్టెప్పులేసి ధోనీని కూడా వేయమని చెప్పడం ఆ వీడియోలో అభిమానులను ఆకట్టుకుంది. జీవా ఎలాగైతే డ్యాన్స్ చేసిందో అచ్చం ఆమెను అనుకరిస్తూ ధోని డ్యాన్స్ చేశాడు. ఈ వీడియోను షేర్‌ చేసిన కొద్ది సేపటికే లక్షల్లో లైకులొచ్చాయి.

Story first published: Saturday, December 22, 2018, 15:19 [IST]
Other articles published on Dec 22, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+