భువనేశ్వర్ కుమార్ తొలి సంపాదన ఎంతో తెలుసా?.. ఆ డబ్బును ఏం చేశాడంటే?!!

మీరట్: టీమిండియా స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్ ప్రస్తుతం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) సెంట్రల్ కాంట్రాక్ట్ ప్లేయర్స్ జాబితాలో గ్రేడ్-ఏలో ఉన్నాడు. సెంట్రల్ కాంట్రాక్ట్స్ జాబితా ప్రకారం భువనేశ్వర్ ఏటా రూ .5 కోట్లు సంపాదిస్తాడు. భూవీ ఇప్పుడైతే కోట్లలో సంపాదిస్తున్నాడు కానీ.. ఒకప్పుడు అందరి యువ క్రికెటర్ల లాగే అవకాశాల కోసం ఎదురు చూశాడు. జాతీయ జట్టులో స్థానం కోసం ఎంతో కష్టపడ్డాడు. అయితే భూవీ తొలి సంపాదన ఎంతో తెలిస్తే ఆశ్చర్యంగా ఉంటుంది.
కొంత షాపింగ్ చేశా, మరికొంత పొదుపు చేశా
ఆదివారం భువనేశ్వర్ కుమార్ ట్విట్టర్ చాట్ షోలో పాల్గొన్నాడు. అభిమానులు వరుసగా ప్రశ్నలు సందిస్తుంటే.. వరుసగా బదులిచ్చాడు. ఈ క్రమంలో ఓ నెటిజన్ మీ తొలి సంపాదన ఎంత అని అడిగాడు. 'నా తొలి సంపాదన రూ.3000' అని భూవీ సమాధానం ఇచ్చాడు. ఏం చేశారని అడగ్గా.. తొలి సంపాదనలో కొంత షాపింగ్ చేశా, మరికొంత డబ్బును పొదుపు చేశా అని అప్పటి మధుర స్మృతులను గుర్తుచేసుకున్నాడు. భూవీ భారత్ తరపున 114 వన్డేలు, 21 టెస్టులు, 43 టీ20లు ఆడాడు. మూడు ఫార్మాట్‌లలో కలిపి 236 వికెట్లు తీశాడు. అంతేకాదు అప్పుడప్పుడు బ్యాట్‌తోనూ రాణించాడు.

నుపుర్ క్రేజీ డాగ్ లవర్
చాట్ షో సందర్భంగా భార్య నుపుర్ నగర్ గురించి ఒక్కమాటలో వివరించమని భువనేశ్వర్ కుమార్‌ను మరో అభిమాని అడిగాడు. అయితే భూవీ మాత్రం చమత్కారంగా స్పదించాడు. 'ఇంటెలిజెంట్, మల్టీ టాస్కింగ్ మరియు ఒక క్రేజీ డాగ్ లవర్' అని నుపుర్ గురించి ఒక్క మాటలో చెప్పాడు. ఇక భువనేశ్వర్, నుపుర్ నగర్‌ల వివాహం 2017 నవంబర్ 23న జరిగిన విషయం తెలిసిందే. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అయిన నుపుర్.. భువీ ఇళ్లు పక్కపక్కనే ఉండేవి. దీంతో చిన్నప్పుడే వీరి మధ్య ప్రేమ చిగురించింది. ఆపై పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు.

పాకిస్థాన్‌తో తొలి టీ20
2012 డిసెంబర్‌లో టీమిండియాలో అడుగుపెట్టిన భువనేశ్వర్ కుమార్.. పాకిస్థాన్‌తో తొలి టీ20 ఆడాడు. ఆ మ్యాచ్‌లో మూడు వికెట్లు పడగొట్టి అందరి దృష్టినీ ఆకర్షించాడు. మరోవైపు రంజీల్లో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ను డకౌట్ చేసిన తొలి బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు. అనంతరం జట్టులో మంచి బౌలర్‌గా పేరుతెచ్చుకున్న భూవీ.. 2013 ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు.

గాయం కారణంగా దూరం
2013 ట్రైనేషన్ సిరీస్‌లో శ్రీలంకపై 4/8 అత్యుత్తమ గణంకాలు నమోదు చేశాడు. ఆపై స్టార్ బౌలర్‌గా మన్ననలు అందుకున్నాడు. మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ.. భూవీపై నమ్మకంగా ఉండేవాడు. దాదాపు 6-8 ఓవర్లు తొలి స్పెల్‌లోనే వేయించేవాడు. గతేడాది డిసెంబర్‌లో వెస్టిండీస్‌తో చివరి టీ20 ఆడాడు. ఆ తర్వాత గాయం కారణంగా ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్, శ్రీలంకతో టీ20 సిరీస్, న్యూజీలాండ్‌తో సుదీర్ఘ సిరీస్ ఆడలేదు. ఇక దక్షిణాఫ్రికా సిరీస్, ఐపీఎల్ 2020 ఆడాలనుకున్నా.. కరోనాతో కుదరలేదు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
భార్యను ఒప్పించడంలో విఫలమైన ధావన్.. కౌంటర్ ఇచ్చిన చహల్!!