
మా కీపింగ్‌ను పరిశీలించుకుంటాం
"మేమిద్దరం పరస్పరం మా కీపింగ్‌ను పరిశీలించుకుంటాం. ఎలాంటి తప్పులు చేస్తున్నామో తెలుసుకుంటాం. ఇది మాకు, జట్టుకు మేలు చేస్తుంది. ఎప్పుడూ ఒకరి తప్పులను ఒకరం ఎత్తిచూపిస్తుంటాం. ఇప్పటిదాకానైతే అంతా బాగానే నడుస్తోంది" అని వృద్ధిమాన్ సాహా అన్నాడు.

నెట్స్‌లో కోహ్లీ వెనుక
నెట్స్‌లో టీమిండియా విరాట్ కోహ్లీ ప్రాక్టీస్‌ను గమనిస్తూ అతడి వెనుక నెట్స్‌లో నిలబడ్డాడు. దీనిపై సాహా స్పందిస్తూ ""నేను వికెట్ బౌన్స్ అయ్యే అనుభూతి చెందడానికి ప్రయత్నిస్తున్నాను. కాబట్టి నేను కోహ్లీ వెనుక నిలబడ్డాను. ఇది ఖచ్చితంగా సహాయపడుతుంది" అని సాహా తెలిపాడు.

మిడిలార్డర్లో వచ్చి పరుగులు
"జట్టుకు అవసరమైన ప్రతిసారీ మిడిలార్డర్లో వచ్చి పరుగులు చేసేందుకే ప్రయత్నిస్తాను. కొన్నిసార్లు ఎక్కువ చేస్తాను. కొన్నిసార్లు కుదరదు. రాంచీలో చివరి టెస్టులో 117 పరుగులు చేశాను. ఇన్నింగ్స్‌లో ఎలా ఆడానో గుర్తు ఉంది. స్టీవ్ స్మిత్‌తో అప్పుడు జరిగిన ఘటన నాకు గుర్తుంది. ఆ మ్యాచ్ డ్రా అయింది. ఈ సారి సిరిస్‌ను 3-0తో గెలుస్తామనే అనుకుంటున్నా" అని సాహా తెలిపాడు.

వికెట్ కీపింగ్ చాలా కష్టం
"వికెట్ కీపింగ్ చాలా కష్టం. చాలామంది కనీసం మాపై జాలి చూపరు. వికెట్ కీపింగ్ కృతజ్ఞత లేని పని. గ్లోవ్స్ వేసుకున్నాం కదా అని ప్రతి బంతి అందుకోవాలని అభిమానులు భావిస్తారు. ఊహించని బౌన్స్ వచ్చే పిచ్‌లపై కీపింగ్ చాలా కష్టం. వికెట్ స్వభావాన్ని బట్టి మేం సిద్ధమవుతాం" అని సాహా పేర్కొన్నాడు.

ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌పై
ఉమేశ్ యాదవ్ లెగ్ సైడ్ బౌలింగ్‌పై "ప్రతి ఒక్కరూ జట్టుకు సహకరించాలని కోరుకుంటారు. అతను (యాదవ్) మొదటి ఇన్నింగ్స్‌లో చాలా బాగా చేశాడు. చాలా అవకాశాలను సృష్టించాడు. అదృష్టవశాత్తూ, అతను లెగ్ సైడ్‌లో సృష్టించిన అవకాశాలను నేను అందుకున్నాను. నేను ఎల్లప్పుడూ జట్టుకు సహాయం చేయాలనుకుంటున్నా. కారణం జట్టు గెలుపులో భాగస్వామ్యం అవడం ఎల్లప్పుడూ మంచిదే" అన అన్నాడు.