Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నిజంగా చెపుతున్నా.. నేను హ్యాట్రిక్ తీస్తాననుకోలేదు: రోహిత్

I seriously can’t believe it: Rohit Sharma recalls IPL hat-trick against Mumbai Indians

ముంబై: ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్)‌లో తాను హ్యాట్రిక్ తీస్తాన‌ని క‌ల‌లో కూడా ఊహించ‌లేద‌ని టీమిండియా స్టార్ ఓపెన‌ర్, పరిమిత ఓవర్ల కెప్టెన్ రోహిత్ శ‌ర్మ అన్నాడు. ఐపీఎల్ లీగ్ తొలి నాళ్ల‌లో డెక్క‌న్ చార్జ‌ర్స్‌కు ప్రాతినిధ్యం వ‌హించిన 'హిట్‌మ్యాన్' రోహిత్.. 2009 ఐపీఎల్‌లో ముంబై ఇండియ‌న్స్‌పై హ్యాట్రిక్ ప‌డ‌గొట్టాడు. తాజాగా ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్న‌ర్‌తో జ‌రిపిన ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో ఆ విష‌యాన్ని రోహిత్ గుర్తు చేసుకున్నాడు.

హ్యాట్రిక్ తీస్తాననుకోలేదు:

హ్యాట్రిక్ తీస్తాననుకోలేదు:

రోహిత్ శర్మ మాట్లాడుతూ... 'నేను నమ్మలేకపోయా. సీరియస్‌గా అదీ ముంబై ఇండియన్స్‌పై హ్యాట్రిక్ వికెట్లు తీస్తానని అస్సలు ఊహించలేదు. అలా జ‌రిగిపోయిందంతే. అస‌లు ఆరోజు ఎలాంటి బంతుల‌తో ఈ ఫీట్ న‌మోదు చేశానో కూడా గుర్తులేదు. అయితే.. ఆ హ్యాట్రిక్ వికెట్ల తర్వాత నా చేతి వేలికి గాయమైంది. దాంతో బౌలింగ్ సమయంలో బంతి గ్రిప్‌ కూడా నాకు సరిగా దొరికేది కాదు. ఈ రోజుల్లో బౌలింగ్‌కి దూరంగా ఉండటమే మంచిది. బ్యాట్స్‌మ‌న్‌గానే ఉండ‌టం సౌక‌ర్య‌వంతం' అని వెల్లడించాడు.

చివరి రెండు బంతులకు నాయర్, హర్భజన్:

చివరి రెండు బంతులకు నాయర్, హర్భజన్:

రోహిత్ శర్మ 2009 ఐపీఎల్ సంద‌ర్భంగా డెక్క‌న్ చార్జ‌ర్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఓ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన దక్కన్ ఛార్జర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 38 పరుగులు బాదాడు. ఆ తర్వాత లక్ష్య ఛేదనలో ముంబై ఇండియన్స్ 15 ఓవర్లు ముగిసే సమయానికి 103/4తో నిలిచింది. ఇక ఐదు ఓవర్లలో 46 పరుగులు చేయాలి. ఛార్జర్స్ కెప్టెన్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ రోహిత్ చేతికి బంతినిచ్చాడు. 16వ ఓవర్‌ వేసిన రోహిత్ శర్మ చివరి రెండు బంతుల్లోనూ అభిషేక్ నాయర్ (1), హర్భజన్ సింగ్ ‌(0)ను ఔట్ చేసాడు.

తొలి బంతికే డుమినీ ఔట్:

తొలి బంతికే డుమినీ ఔట్:

ఇక 18వ ఓవర్ తొలి బంతికే జేపీ డుమినీ (52)ని ఔట్ చేసిన రోహిత్.. ముంబై ఇండియన్స్‌ని కోలుకోలేని దెబ్బ తీశాడు. డుమినీ వికెట్ పడడంతో హ్యాట్రిక్ నమోదయింది. ఐపీఎల్లో అత్యంత పిన్న వయ‌సు బౌల‌ర్ న‌మోదు చేసిన హ్యాట్రిక్ ఇదే కావ‌డం విశేషం. మొత్తంగా ఆ మ్యాచ్‌లో రెండు ఓవ‌ర్లు బౌలింగ్ చేసిన హిట్‌మ్యాన్.. 6 ప‌రుగులిచ్చి 4 వికెట్లు ప‌డ‌గొట్టాడు. దీంతో డెక్క‌న్ చార్జ‌ర్స్ విజ‌యం సాధించింది. మొత్తంగా ఆ మ్యాచ్‌లో దక్కన్ ఛార్జర్స్ 19 పరుగుల తేడాతో గెలుపొందింది.

కెప్టెన్‌గా నాలుగు ఐపీఎల్ టైటిల్స్‌:

కెప్టెన్‌గా నాలుగు ఐపీఎల్ టైటిల్స్‌:

ఆ తర్వాత ముంబై ఇండియన్స్ జట్టుకి మారిన రోహిత్ శర్మ.. ఆ టీమ్‌కి కెప్టెన్‌గా ఏకంగా నాలుగు ఐపీఎల్ టైటిల్స్‌ని అందించాడు. అంతేకాదు ఐపీఎల్లో రోహిత్ పేరిట ఎన్నోరికార్డులు ఉన్నాయి. నాలుగు టైటిళ్ల‌ను సాధించిన ఏకైక కెప్టెన్‌గా ఐపీఎల్లో రోహిత్ పేరిటే రికార్డు ఉంది. త‌న సార‌థ్యంలో ముంబై ఇండియ‌న్స్ నాలుగుసార్లు విజేత‌గా నిలిచింది. మరోవైపు 2009లో ఐపీఎల్ విజేత‌గా నిలిచిన డెక్క‌న్ ఛార్జ‌ర్స్‌ జ‌ట్టులో స‌భ్యుడు. ఐపీఎల్లో మ‌రే క్రికెట‌ర్ ఇలా ఐదు టైటిళ్ల విజ‌యాల్లో పాలు పంచుకోలేదు.

Story first published: Sunday, May 10, 2020, 14:37 [IST]
Other articles published on May 10, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+