'సంగక్కర వ్యక్తిగతంగా దూషించాడు.. నేను అతని భార్య గురించి కామెంట్ చేశా'

న్యూఢిల్లీ: టీమిండియా వెటరన్ పేసర్ ఇర్ఫాన్ పఠాన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. గాయాల కారణంగా పడుతూ లేస్తూ సాగిన కెరీర్‌కు ఎట్టకేలకు ఫుల్‌స్టాప్ పెడుతూ.. ఆటలోని అన్ని ఫార్మాట్‌ల నుంచి తప్పుకుంటున్నట్లు శనివారం పేర్కొన్నాడు. రిటైర్మెంట్ సందర్భంగా పఠాన్ తన జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్నాడు. ఈ క్రమంలో ఢిల్లీలో శ్రీలంకతో జరిగిన ఒక టెస్టు మ్యాచ్‌లో కుమార సంగక్కరను స్లెడ్జ్ చేయడాన్ని గుర్తు చేసుకున్నాడు.

వ్యక్తిగతంగా దూషించాడు:
పఠాన్ తాజాగా మాట్లాడుతూ.. సంగక్కరాను స్లెడ్జ్ చేసే క్రమంలో అతని భార్య యహాలి సంగక్కర గురించి కూడా కామెంట్ చేయాల్సి వచ్చిందని తెలిపాడు. 'గతంలో ఢిల్లీలో టెస్ట్ మ్యాచ్‌లో వీరేంద్ర సెహ్వాగ్ గాయపడటంతో నేను బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుకొచ్చా. రెండో ఇన్నింగ్స్‌లో 93 పరుగులు చేశా. మ్యాచ్ తమ చేజారుతుండడంతో సంగక్కరలో అసహనం ఏర్పడింది. అయితే అప్పటికి మురళీధరన్ బౌలింగ్ చేస్తున్నాడు. ఆ దశలో కవ్వించేందుకు సంగక్కర నన్ను వ్యక్తిగతంగా దూషించాడు' అని పఠాన్ తెలిపాడు.

సంగా భార్య గురించి కామెంట్ చేశా:
'సంగక్కరపై నేను కూడా వ్యక్తిగత దూషణకే దిగా. ఈ క్రమంలో అతని భార్య యహాలి గురించి కామెంట్ చేశా. అతను కూడా నా తల్లి దండ్రుల గురించి వ్యాఖ్యలు చేశాడు. ఆ సమయంలో ఇద్దరం త్రీవ ఆగ్రహానికి లోనయ్యాం. ఆ మ్యాచ్ తర్వాత కూడా మేమిద్దరం సంతోషంగా లేము. ఒకరి ముఖాలు ఒకరు చూసుకోలేదు' అని పఠాన్ చెప్పుకొచ్చాడు.

తొలి ఓవర్లోనే హ్యాట్రిక్:
పఠాన్ ఖాతాలో ఎన్నో అద్భుతమైన రికార్డులు ఉన్నాయి. 2003, లాహోర్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన యూత్ వన్డేల్లో 9/16తో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. టెస్టుల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై తొలి ఓవర్లోనే హ్యాట్రిక్ వికెట్లు తీసిన ఒకేఒక్క బౌలర్‌గా చరిత్ర పుటల్లోకి ఎక్కాడు. 2007లో జరిగిన అరంగేట్ర టీ20 ప్రపంచకప్ ఫైనల్లో అద్భుత ప్రదర్శనతో 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్'గా ఎంపికయ్యాడు.

2012లో చివరిసారిగా:
ఇర్ఫాన్ పఠాన్ 2012, అక్టోబర్‌లో చివరిసారిగా టీమిండియా తరఫున ఆడాడు. 29 టెస్టుల్లో 1,105 పరుగులు చేసి 100 వికెట్లు తీశాడు. 120 వన్డేల్లో 1,544 పరుగులతో పాటు 173 వికెట్లు పడగొట్టాడు. ఇక 24 టీ20ల్లో 172 పరుగులు, 28 వికెట్లు తీశాడు. పఠాన్ ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ జట్టుకు మెంటార్‌గా ఉన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications