Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నా బాధను ఎవరూ పట్టించుకోలేదు- శ్రేయస్

ఐపీఎల్‌-2024లో అంతిమ ఘట్టానికి వేళైంది. టైటిల్ పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడనుంది. ఆదివారం జరగనున్న ఈ హైవోల్టేజ్ మ్యాచ్‌కు చెపాక్ వేదిక కానుంది. ఐపీఎల్ లీగ్ దశను కేకేఆర్ కేవలం మూడే ఓటములతో ముగించింది. మరే జట్టుకు సాధ్యం కానీ నెట్‌రన్‌రేటుతో టేబుల్ టాపర్‌గా నిలిచింది.

కోల్‌కతా సాధించిన విజయాల్లో శ్రేయస్ అయ్యర్‌ది కీలకపాత్ర. జట్టులోని ఆటగాళ్లను చక్కగా ఉపయోగించుకుంటూ శ్రేయస్ విజయాలతో హోరెత్తించాడు. ఆఖరి పోరులోనూ అదే జోరును ప్రదర్శించి టైటిల్ సాధించాలని కసితో ఉన్నాడు. ఫైనల్‌లో కేకేఆర్‌ను గెలిపిస్తే ఐపీఎల్‌లో ట్రోఫీ సాధించిన ఎనిమిదో కెప్టెన్‌గా శ్రేయస్ చరిత్రకెక్కుతాడు.
అలాగే నాలుగో భారత ఆటగాడిగా రికార్డు సాధిస్తాడు.

I raised my concern but no one was agreeing - Shreyas Iyer

ఐపీఎల్‌లో ఇప్పటివరకు ఏడుగురు కెప్టెన్లు ట్రోఫీని అందుకున్నారు. భారత్ ఆటగాళ్లు ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మ చెరో అయిదు సార్లు, గౌతమ్ గంభీర్ రెండు సార్లు కప్‌ను ముద్దాడారు. ఆస్ట్రేలియా క్రికెటర్లు షేన్ వార్న్, గిల్ క్రిస్ట్, డేవిడ్ వార్నర్ కూడా టైటిల్ సాధించారు. ఇవాళ కేకేఆర్ గెలిస్తే శ్రేయస్‌తో ఐపీఎ‌ల్‌లో భారత్-ఆస్ట్రేలియా కెప్టెన్ల రికార్డు 4-4తో సమం అవుతుంది.

కాగా, ఐపీఎల్-2024 ప్రారంభానికి ముందు తాను కష్టకాలాన్ని ఎదుర్కొన్నానని శ్రేయస్ చెప్పాడు. దేశవాళీ క్రికెట్‌ను ఆడటానికి ఆసక్తి చూపించట్లేదని శ్రేయస్‌కు బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ నిరాకరించిన సంగతి తెలిసిందే. అయితే ఆ సమయంలో తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడ్డాడని, కానీ ఆ విషయం ఎవరికీ చెప్పినా పట్టించుకోలేదని శ్రేయస్ చెప్పాడు. ఈ విషయం తనపై ప్రభావం చూపించిందని, ఆ తర్వాత తనతో తానే పోటీపడ్డానని పేర్కొన్నాడు.

ఐపీఎల్ సీజన్ ప్రారంభమయ్యాక తన సత్తా ప్రపంచానికి చాటి చెప్పాలనుకున్నాని శ్రేయస్ అన్నాడు. సరైన ప్రణాళికతో బరిలోకి దిగుతూ సత్ఫలితాల్ని సాధిస్తున్నామని, ఆ ప్రదర్శన తమ జట్టును ఫైనల్‌కు చేర్చిందని చెప్పాడు. విజయాల్లో తమ మెంటార్ గంభీర్‌ది కీలక పాత్ర అని శ్రేయస్ కొనియాడాడు. కాగా, అదే జోరును ప్రదర్శిస్తూ ఇవాళ టైటిల్ గెలుస్తామని ఆశాభావం వ్యక్తం చేశాడు.

Story first published: Sunday, May 26, 2024, 15:45 [IST]
Other articles published on May 26, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+