'కరుణ్ నాయర్‌ను మరింత మెరుగవ్వాలని సూచించాం'

న్యూఢిల్లీ: ఆసియా కప్ అనంతరం టీమిండియా వెస్టిండీస్‌తో ఆడనున్న సిరీస్‌కు కరుణ్ నాయర్‌ను ఎంపిక చేయకపోవడం పట్ల ఎమ్మెస్కే ప్రసాద్ మాట్లాడాడు. టీమిండియా రెండో ట్రిపుల్ సెంచరీ యోధుడు కరుణ్‌నాయర్‌తో జట్టులోకి తీసుకోని విషయం గురించి వివరంగా మాట్లాడానని బీసీసీఐ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ అన్నారు. ఇంగ్లాండ్‌తో ఒక్క మ్యాచ్‌లోనూ అతడిని తుదిజట్టులోకి తీసుకోలేదు. తాజా వెస్టిండీస్ సిరీస్‌కు అసలు ఎంపికే చేయలేదు.

వెంటనే కరుణ్‌నాయర్‌తో మాట్లాడా
‘వెస్టిండీస్‌కు జట్టును ప్రకటించిన వెంటనే కరుణ్‌నాయర్‌తో వ్యక్తిగతంగా మాట్లాడా. పునరాగమనానికి మార్గాలు సూచించా. ఆటగాళ్లతో నిరంతరం సంప్రదించడంపై సెలక్షన్ కమిటీ ప్రత్యేక దృష్టి సారించింది. ఆటగాళ్లతో మాట్లాడడానికి కమిటీ ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తుంది. ఒక ఆటగాడికి చేదు వార్తను చెప్పడం చాలా కష్టం. జట్టులోంచి అతడినెందుకు తొలగించారో చెప్పాలంటే సరైన కారణాలు చెప్పాలి. లేదంటే వారు అంగీకరించరు. 'అని ఎమ్మెస్కే పేర్కొన్నారు.

మంచి ప్రదర్శనలు చేయాలని కోరాం
‘ఇంగ్లాండ్ పర్యటనలో మా సహచరుడు దేవాంగ్ గాంధీ నిరంతరం కరుణ్‌నాయర్‌తో మాట్లాడుతూనే ఉన్నాడు. అవకాశాల కోసం ఎదురుచూడాలని ఆత్మవిశ్వాసం కల్పించాడు. జట్టులోకి రావాలంటే రంజీల్లో, భారత్-ఏ తరఫున రాణించాలని కరుణ్‌కు సూచించా. టెస్టు క్రికెట్ పోటీలో కరుణ్ ఉన్నాడు. ప్రస్తుతం అతడిని దేశవాళీ, భారత్-ఏ తరఫున మంచి ప్రదర్శనలు చేయాలని కోరాం' అని ఎమ్మెస్కే అన్నాడు.

జట్టు మేనేజ్‌మెంట్‌కు ఇష్టం లేదని
ఇంగ్లాండ్‌తో చివరి రెండు మ్యాచ్‌లలో కరుణ్‌కు అవకాశం వస్తుందని భావించినా హనుమ విహారిని అరంగేట్రం చేయించారు. దీంతో భారత జట్టులోకి ఈ యువ కర్ణాటక బ్యాట్స్‌మన్‌ను తీసుకోవడం జట్టు మేనేజ్‌మెంట్‌కు ఇష్టం లేదన్న వార్తలు వినిపించాయి. తనతో జట్టు మేనేజ్‌మెంట్ లేదా సెలక్టర్లు మాట్లాడలేదని కరుణ్ స్వయంగా ఓ ముఖాముఖిలో చెప్పాడు.

నిర్ణయానికి తలొగ్గాల్సిన పరిస్థితి
జట్టుకు దూరమవడం అనేది సహజంగా ఎవరికైనా బాధ కల్గిస్తుంది, దీన్ని అధిగమించడం కష్టం కావచ్చు. నన్ను తప్పియడానికి తీసుకున్న నిర్ణయంలో టీమ్ మేనేజ్‌మెంట్‌తో పాటు ప్రతి ఒక్కరూ పాలుపంచుకున్నారు. ఓ ఆటగానిగా వారి నిర్ణయానికి తలొగ్గడం తప్పా..ఏమి చేయలేని పరిస్థితి. అవకాశం ఎప్పుడు వచ్చినా బ్యాటుతోనే సమాధానం చెబుతా అని కరుణ్ అన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications