న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వార్నర్‌ను చుట్టుముట్టిన మరో వేదన, మళ్లీ అతని భార్య...

I paid the ultimate price: Candice Warner tells of miscarriage after ball-tampering scandal

హైదరాబాద్: బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడి నిషేదానికి గురైన ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఇంట మరోసారి విషాదం అలముకుంది. దక్షిణాఫ్రికాతో జరిగిన కేప్‌టౌన్‌ టెస్టులో డికాక్‌తో గొడవ పడిన వార్నర్‌ బాల్‌ ట్యాంపరింగ్‌కు పాల్పడ్డాడు. తన సతీమణి క్యాండిస్‌ను అవమానకరంగా తిట్టినందుకే ఇలా చేసినట్టు అతడు తర్వాత వివరణ ఇచ్చాడు.

దీంతో ఈ ఘటనను అవమానకరంగా భావించిన ఆస్ట్రేలియా క్రికెట్‌ సంఘం వెంటనే వార్నర్‌, స్మిత్‌, బాన్ క్రాఫ్ట్‌ను తిరిగి స్వదేశానికి పిలిపించింది. ఈ ఘటనపై సతీసమేతంగా మీడియా సమావేశంలో పాల్గొన్న వార్నర్‌లు తీవ్ర మనోవేదనకు గురైయ్యారు. ఈ ఘటనతో వారిపైనే కాకుండా అప్పటికే గర్భీణిగా ఉన్న వార్నర్ భార్య కడుపులో పడిన శిశువుపై కూడా పడింది. కుంగుబాటు, అలసట, అవమానానికి గురైన ఆమెకు చివరికి గర్భస్రావం జరిగింది. వార్నర్‌ కుటుంబాన్ని అంతులేని విషాదంలో నింపేసింది.

వార్నర్ భార్య.. క్యాండిస్‌ ఓ వారపత్రికకు ఇచ్చిన ముఖాముఖి ద్వారా ఈ విషయం బయటి ప్రపంచానికి తాజాగా తెలిసింది. 'దీని (గర్భస్రావం) వెనక భయానక కారణాలు ఉన్నాయి. కేప్‌టౌన్‌ అంటే మాకెంతో ప్రేమ. 2014లో డేవ్‌ నన్ను ప్రేమిస్తున్నట్టు చెప్పిందీ ఇక్కడే. టెస్టు సిరీస్‌ కోసం మళ్లీ ఇక్కడికి వచ్చినప్పుడు నేను గర్భవతినని తెలిసింది. నా శరీరంలో మార్పులు ప్రారంభమయ్యాయి. చిన్నారి వార్నర్‌ వస్తున్నాడని తెలిసి మేమెంతో సంతోషించాం. చాన్నాళ్ల నుంచి మేం మరొకర్ని కనేందుకు ప్రయత్నిస్తున్నాం. కేప్‌టౌన్‌ చేరిన వెంటనే పరీక్ష చేయించుకున్నా' అని క్యాండిస్‌ తెలిపారు.

'నేను డేవ్‌ను వెంటనే బాత్‌రూమ్‌లోకి పిలిచి రక్తస్రావం అవుతున్నట్టు చెప్పాను. మాకప్పుడే తెలిసింది గర్భస్రావం జరిగిందని. మేం ఒకరి భుజాలపై ఒకరం తలపెట్టి కన్నీరు కార్చాం. ఒక భయానక క్రికెట్‌ పర్యటనకు ఇది గుండె పగిలే ముగింపు. జనాల అవమానకర మాటల నుంచి బాల్‌ ట్యాంపరింగ్‌ వరకూ ఎదుర్కొన్న కఠిన పరీక్షలు చివరికి కన్నీటినే మిగిల్చాయి' అని క్యాండిస్‌ బాధాతప్త హృదయంతో ప్రపంచానికి చెప్పారు.

Story first published: Thursday, May 24, 2018, 9:21 [IST]
Other articles published on May 24, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X