Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'నా జీవితం, ఈ గెలుపు గౌతం గంభీర్‌కే అంకితం'

I Owe My Life And Success To Gautam Gambhir: Navdeep Saini

హైదరాబాద్: పదేళ్ల తర్వాత రంజీ క్రికెట్‌లో ఢిల్లీ జట్టు ఫైనల్‌కు వెళ్లింది. ఢిల్లీ జట్టు ఫైనల్‌కు చేరడంలో కీలకపాత్ర పోషించిన క్రికెటర్లపై ప్రశంసల వర్షం కురుస్తోంది. తాజాగా ఈ జాబితాలోకి ఢిల్లీ పేసర్ నవదీప్ సైనీ చేరాడు. బెంగాల్‌తో జరిగిన సెమీ ఫైనల్లో నవదీప్ సైనీ ఏడు వికెట్లు తీసి 79 పరుగులిచ్చాడు.

తద్వారా సైనీ కెరీర్‌లోనే అత్యుత్తమ బౌలంగ్ గణాంకాలు నమోదు చేశాడు. దీంతో సెమీస్‌లో బెంగాల్‌పై ఇన్నింగ్స్ 26 పరుగులతో గెలిచిన ఢిల్లీ ఫైనల్ చేరింది. మ్యాచ్ అనంతరం సైనీ మాట్లాడుతూ తాను వెటరన్ క్రికెటర్ గంభీర్‌కు ఎంతో రుణపడి ఉన్నానని చెప్పాడు.

అంతేకాదు తన సక్సెస్ వెనుక గౌతం గంభీర్ ఉన్నాడని అన్నాడు. 'నా జీవితం, ఈ గెలుపు గంభీర్‌కే అంకితం. గంభీర్ భయ్యా లేకుండా నేను లేను. అతనే నా సక్సెస్‌కు కారణం' అని సైనీ స్పష్టంచేశాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో సైనీకి తొలిసారి ఛాన్స్ ఇచ్చింది గంభీర్ కావడం విశేషం.

సైనీ నెట్ బౌలర్‌గా దక్షిణాఫ్రికాకు వెళ్లాల్సి ఉంది. అయితే రంజీ క్రికెట్‌లో ఢిల్లీకి తన సేవలు అవసరమని, అందులో రాణిస్తే భారత జట్టు డ్రెస్సింగ్ రూమ్‌లో ఉంటావని గంభీర్ చెప్పడంతో తాను వెళ్లలేదని సైనీ అన్నాడు. ఇక, సైనీ గురించి అభిమానులకు తెలియని మరోక విషయం ఉంది.

సైనీ తాత కరమ్ సింగ్.. నేతాజీ సుభాష్ చంద్రబోస్ నెలకొల్పిన ఆజాద్ హిందు ఫౌజ్‌లో సభ్యుడిగా ఉన్నాడు. ఆయన నేతాజీతో కలిసి జపాన్‌లో ఉండేవాడని సైనీ చెప్పాడు. ఇప్పుడు తన తాత వయసు వందేళ్లని, తాజాగా రంజీ ట్రోఫీ సెమీస్‌లో తాను బౌలింగ్ చేయడాన్ని కూడా ఆయన టీవీలో చూశారని సైనీ తెలిపాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Wednesday, December 20, 2017, 16:44 [IST]
Other articles published on Dec 20, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+