ప్రపంచకప్ 2019 ఫైనల్.. 'ఓవర్ త్రో'పై క్లారిటీ ఇచ్చిన స్టోక్స్

హైదరాబాద్: లార్డ్స్ మైదానంలో న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ విజయం సాధించి తొలిసారి ప్రపంచకప్‌ను ముద్దాడింది. చివరి ఓవర్‌లో ఓవర్ త్రో కారణంగా ఇంగ్లాండ్‌కు ఆరు పరగులు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆరు పరగులు కాకుండా ఐదు పరుగులే ఇవ్వాలని వివాదం చెలరేగింది. ఇక 'ఓవర్ త్రో'కు ఇచ్చిన అదనపు పరుగులు అవసరం లేదని ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ ఎంపైర్‌తో చెప్పినట్టు వార్తలు వచ్చాయి.
ప్రొ కబడ్డీ లీగ్ సీజన్-7 ప్రత్యేక వార్తల కోసం

తప్పుడు వార్తలు:
తాజాగా ఓవర్ త్రోపై స్టోక్స్ స్పందించాడు. ఓ మీడియాతో మాట్లాడుతూ... 'ఓవర్ త్రోపై వచ్చిన వార్తలు అన్నీ చూశాను. నిజాయితీగా చెప్తున్నా.. నేను ఎంపైర్ వద్దకు వెళ్లి ఓవర్ త్రో పరుగులు అవసరం లేదని చెప్పలేదు. అవన్ని తప్పుడు వార్తలు. న్యూజిలాండ్ ఆటగాడు టామ్ లాథమ్ వద్దకు వెళ్లి క్షమాపణ అడిగా. కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ను క్షమించమని కోరా' అని స్టోక్స్ స్పష్టం చేసాడు.

సూపర్ ఓవర్ కూడా టై:
ఫైనల్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 241 పరుగులు చేసింది. అనంతరం 242 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ కూడా నిర్ణీత 50 ఓవర్లలో 241 పరుగులే చేయడంతో మ్యాచ్ టైగా ముగిసింది. దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారితీసింది. సూపర్ ఓవర్ కూడా టై కావడంతో.. మ్యాచ్‌లో అత్యధిక బౌండరీలు బాదిన ఇంగ్లాండ్ జట్టు విజేతగా నిలిచింది.

స్టోక్స్ బ్యాట్‌కు తగిలి బౌండరీ:
ఇంగ్లండ్ లక్ష్య ఛేదనలో ట్రెంట్ బోల్ట్ వేసిన ఆఖరి ఓవర్ నాల్గో బంతి ఓవర్ త్రో రూపంలో బౌండరీకి వెళ్ళింది. బంతి స్టోక్స్ బ్యాట్‌కు తగిలి బౌండరీ వెళ్లడంతో ఇంగ్లండ్‌కు మొత్తం ఆరు పరుగులు వచ్చాయి. ఇక్కడే మ్యాచ్ మలుపు తిరిగింది. చివరి బంతికి రెండు పరుగులు అవసరం కాగా.. మార్క్ వుడ్ ఒక పరుగు పూర్తి చేసి మరో పరుగు కోసం ప్రయత్నిస్తుండగా రనౌట్ అయ్యాడు. ఈ ఓవర్ త్రోపై చాలా రకాలుగా వార్తలు వచ్చిన నేపథ్యంలో చివరకు స్టోక్స్ అన్నింటికీ చెక్ పెట్టాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications