
హైదరాబాద్ : 'దక్షిణాఫ్రికా పర్యటనకు త్వరలో వెళ్లాల్సి ఉంది. అప్పటికి నేను సిద్ధం కావాలంటే నాకు కొంచెం విశ్రాంతి కావాలి.'అని పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ అన్నాడు. గత 48 నెలలుగా విశ్రాంతి లేకుండా క్రికెట్ ఆడుతుండటంతో తనకు విశ్రాంతి తీసుకోవాల్సిందే అంటూ తను అభిప్రాయపడ్డాడు. ఎందుకంటే మున్ముందు దక్షిణాఫ్రికా పర్యటనకు ఇండియా టీం కెప్టెన్ సిద్ధంగా ఉండాలి కదా.
'2017 క్యాలెండర్ ఇయర్‌లో కోహ్లీ 2,818 పరుగులు మాత్రమే సాధించాడు. 2014లో సంగాక్కర 2,868 పరుగులు సాధించాడు. కోహ్లీ కంటే సంగాక్కరనే అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు' అని ట్విటర్‌లో ఓ అభిమాని పేర్కొన్నాడు. దానికి స్పందించిన మాజీ క్రికెటర్ కుమార సంగాక్కర కోహ్లీ 'డిఫరెంట్ క్లాస్ ప్లేయర్'ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే వచ్చే ఏడాది నా రికార్డును అధిగమిస్తాడు.
మరోవైపు పెళ్లి కోసం కోహ్లీ గురువారం అనుష్క శర్మతో కలిసి ఇటలీకి బయలుదేరతాడంటూ జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. కోహ్లీ పెళ్లి కోసం కోహ్లీ కుటుంబసభ్యులు, స్నేహితులు టిక్కెట్లు కూడా బుక్ చేసేసుకున్నారట
దీంతో వచ్చే ఏడాది దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లే ముందు విశ్రాంతి కావాలని అడగడంతో కోహ్లీకి విశ్రాంతినిచ్చామని బీసీసీఐ సెలక్టర్లు చెబుతున్నారు. అయితే అనుష్క శర్మతో పెళ్లి పెళ్లాడేందుకే సెలవలు తీసుకున్నాడని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. డిసెంబరు 9, 10, 11, 12 తేదీల్లో ఇటలీలో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరుగనున్నట్లు సమాచారం.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.