మూడో టెస్టులో సెంచరీ కొడతా: రహానె

మెల్‌బోర్న్: ఆస్ట్రేలియా-భారత్‌లు టెస్టు సిరీస్‌లో భాగంగా మూడో టెస్టులో తలపడనున్నాయి. రెండో టెస్టు తరహాలో కాకుండా మూడో టెస్టుకు ఎక్కువ విరామమే దొరకడంతో క్రికెటర్లంతా రిఫ్రెష్ అయ్యారట. దీంతో తమ జట్టు మరింత రాణించేందుకు దోహదపడుతుందని టీమిండియా వైస్ కెప్టెన్ అజింకా రహానె అంటున్నాడు. అంతేకాదు, బాక్సింగ్ డే టెస్టులో తాను సెంచరీ లేదా అంతకుమించి పరుగులు చేసే అవకాశాలున్నాయంటున్నాడు. పెర్త్ వేదికగా ఆడిన రెండు ఇన్నింగ్స్‌లోనూ హాఫ్ సెంచరీలను బాదిన రహానె మూడో టెస్టుకు సెంచరీ చేసే స్థాయిలో సిద్ధమైయ్యాడట.

బాక్సింగ్ డే టెస్టు కోసం ప్రాక్టీస్ చేశాం
వ్యక్తిగత మైలురాళ్లు దాటడం అటుంచితే జట్టుగా గెలవడం ముఖ్యం. బాక్సింగ్ డే టెస్టు కోసం బాగా ప్రాక్టీస్ చేశాం. ప్రస్తుతం సిరీస్ 1-1గా ఉంది. దీంతో గెలిచేందుకు చక్కగా ప్రయత్నంచే అవకాశముంది. పెర్త్‌లో అవకాశమున్నంతవరకూ పోరాడాం. ప్రస్తుతం మా ముందుంది డిసెంబరు 26న ఆరంభం కానున్న బాక్సింగ్ డే టెస్టు మాత్రంమే. బ్యాటింగ్ యూనిట్ కచ్చితంగా బౌలింగ్ యూనిట్‌కు మద్దతివ్వాల్సి ఉంటుంది.

మరోసారి ఇలాంటి ఫలితాలను పునరావృతం చేయం
పెర్త్ టెస్టులో అలా జరగలేదు. బౌలర్లు చక్కగా రాణించారు. వారికి సమానమైన స్థాయిలో బ్యాట్స్‌మెన్ రాణించి ఉంటే బాగుండేది. దక్షిణాఫ్రికా పర్యటనను భారత్ 1-2తేడాతో ఓడిపోయింది. ఇంగ్లాండ్ పర్యటనను 1-4తేడాతో కోల్పోయాం. మరోసారి ఇలాంటి ఫలితాలను పునరావృతం చేయకూడదనుకుంటున్నాం. రెండో టెస్టులో 146పరుగుల తేడాతో ఓడిపోవడం అస్సలు బాగోలేదు. దీనికి కారణం రెండో ఇన్నింగ్స్‌ను 140పరుగుల తేడాతో ముగించడమే కారణం. దీనిని బట్టి ప్రతి సీజన్‌ను జాగ్రత్తగా ముగించాలని తెలుస్తోంది.

అవసరమైతే స్థానం మార్చుకుని బరిలోకి
టెస్టు క్రికెట్‌లో ప్రతి చిన్న అవకాశాన్ని ఒడిసిపట్టుకోవాల్సి ఉంటుంది. సిరీస్‌లోని మిగిలిన రెండు టెస్టులు కీలకమైనవి. రెండో టెస్టు అనంతరం మంచి విరామం దొరికింది. ఫ్రెష్ మైండ్‌తో ఇన్నింగ్స్ ఆరంభించేందుకు ఇదే చక్కని సమయం. బ్యాటింగ్ 4లోనా 5లోనా అనేది విషయం కాదు. అవసరమైతే స్థానం మార్చుకుని బరిలోకి దిగాల్సి వచ్చినా సిద్ధంగానే ఉన్నా. మిడిల్‌లో బ్యాటింగ్‌కు దిగాల్సి వస్తే అంతకంటే చక్కటి అవకాశం మరొకటి లేదనుకుంటాను.

ఆట మీదే ధ్యాస తప్పకుండా స్లెడ్జింగ్
పెర్త్‌లో కౌంటర్ అటాక్ చేయడం పూర్తిగా నా నిర్ణయమే. పరిస్థితులకు తగ్గట్టు బ్యాటింగ్ శైలి మార్చుకోవాలి. ధైర్యంగా నిర్ణయం తీసుకోకపోతే పరిస్థితులను ఎదుర్కోవడం కష్టం. ఇలాంటి పోరాటం ఉండకపోతే టెస్టు క్రికెట్ సజీవంగా ఉండదు. పెర్త్ మైదానంలో జరిగిన విషయం మంచికే అనుకోవాలి. పోటీతత్వం ఉంటేనే ఆటలో మెరుగుసాధించగలం. ఏం జరిగినా ఆట మీదే ధ్యాస ఉంచాం. స్లెడ్జింగ్ చేయవచ్చు కానీ, పోటీతత్వంతో ఆట మీద దృష్టి మరల్చకుండా ఆడాల్సి ఉంటుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications