న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'ప్రతి మ్యాచ్‌లోనూ మ్యాజిక్ చేయడానికి నేనేమీ మేజిషియన్‌ను కాను'

ICC Cricket World Cup 2019 : Kuldeep Yadav Says I'm Successful Because Kohli Gave Me Freedom To Play
Im Successful because Kohli gave me freedom to attack: Kuldeep Yadav

హైదరాబాద్: తన ఎదుగుదలకు కారణం... టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తనకు దూకుడుగా బౌలింగ్ చేసేందుకు ఇచ్చిన స్వేచ్ఛ అని చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తెలిపాడు. "మనలోని సత్తాని నమ్మే కెప్టెన్ ఉంటే మనం తప్పకుండా రాణిస్తాం. అలాంటి కెప్టెన్ దొరికితే మనం కచ్చితంగా సక్సెస్ అవుతాం. కోహ్లీ నేను దూకుడుగా బౌలింగ్ చేసేందుకు ఎంతో స్వేచ్ఛ ఇచ్చాడు" అని తెలిపాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ 2019 ప్రత్యేక వార్తల కోసం

ఇటీవలే ముగిసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన కుల్దీప్ యాదవ్ మొత్తం తొమ్మిది మ్యాచులాడి 4 వికెట్లు మాత్రమే తీశాడు. ఈ సీజన్‌లో కుల్దీప్ పేలవ ప్రదర్శన కారణంగా మిగితా మ్యాచ్‌లకు అతడిని కెప్టెన్ దినేశ్ కార్తీక్ తుది జట్టులోకి తీసుకోలేదు.

ఎంతో బాధకలిగించింది

ఎంతో బాధకలిగించింది

ఇది తనను ఎంతో బాధకలిగించదని, అయితే, వరల్డ్‌‌కప్ ఐపీఎల్ రెండు వేరు వేరని కుల్దీప్ అన్నాడు. "వరల్డ్‌కప్‌తో పోలిస్ ఐపీఎల్ ఎంతో భిన్నం. ఐపీఎల్‌లో గతంలో రాణించిన ఆటగాళ్లు ఉంటారు. అయితే, వరల్డ్‌కప్‌లో అందరూ దేశం కోసం ఆడతారు. బౌలర్‌గా నేను ఎంతో పరిణితి సాధించా, ఐపీఎల్ ప్రదర్శన ప్రపంచకప్‌పై ప్రభావం చూపుతుందని భావించడం లేదు" అని కుల్దీప్ అన్నాడు.

టీ20ల్లో భారీగా పరుగులు

టీ20ల్లో భారీగా పరుగులు

"టీ20ల్లో మనది కాని రోజు ధారాళంగా పరుగులు సమర్పించుకోవాల్సి ఉంటుంది. ప్రతి మ్యాచ్‌లోనూ మ్యాజిక్ చేయడానికి నేనేమీ మేజిషియన్‌ను కాను. మరిన్ని వికెట్లు తీస్తానని చెప్పలేను. నేను వికెట్లు తీయనంత మాత్రాన నేను బౌలింగ్ సరిగ్గా చేయడం లేదు అని కాదు. ఇక్కడ నేను జట్టు అవసరాలను బట్టి ఆడాల్సి ఉంటుంది" అని కుల్దీప్ పేర్కొన్నాడు.

మొత్తం 46 రోజులు

మొత్తం 46 రోజులు

మే30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా ఆరంభం కానున్న వన్డే వరల్డ్ కప్‌లో మొత్తం 46 రోజుల పాటు జరగనుంది. వన్డే వరల్డ్‌కప్‌కు ఇంగ్లాండ్ ఆతిథ్యమివ్వడం ఇది ఐదోసారి(1975, 1979, 1983, 1999). సరిగ్గా 20 ఏళ్ల తర్వాత మరోసారి వన్డే వరల్డ్‌కప్‌కు ఇంగ్లాండ్ వేదికగా మారింది. ప్రస్తుతం జరుగుతున్న వన్డే వరల్డ్‌కప్ 12వ ఎడిషన్ కావడం విశేషం.

11 వేదికల్లో 46 రోజులు

11 వేదికల్లో 46 రోజులు

సొంతగడ్డపై జరుగుతున్న వన్డే వరల్డ్‌కప్ కావడంతో ఆతిథ్య జట్టు ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. మే30 నుంచి జులై 14వరకు జరగనున్న ఈ మెగా టోర్నీలో మొత్తం 10 జట్లు పాల్గొంటున్నాయి. యుకేలోని మొత్తం 11 వేదికల్లో 46 రోజుల పాటు మొత్తం 48 మ్యాచ్‌లు జరగనున్నాయి. జులై 14న జరిగే వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌కి ప్రఖ్యాత లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ ఆతిథ్యమివ్వనుంది.

Story first published: Thursday, May 16, 2019, 19:39 [IST]
Other articles published on May 16, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X