క్షమాపణ చెప్పి.. దయచేసి నాపై నిషేధం విధించకండి అని చెప్పేసి వచ్చేశా: కోహ్లీ


హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన కెరీర్ ఆరంభంలో ఎంత దూకుడుగా ఉండేవాడో మనందరికీ తెలిసిందే. ప్రత్యర్థి జట్టులోని ఆటగాళ్లు ఏమాత్రం కవ్వించే ప్రయత్నం చేసినా.. కోహ్లీ కూడా అంతే దీటుగా వారికి బదులిచ్చేవాడు. అది మాటలతో అయినా.. బ్యాట్‌తో అయినా అస్సలు వెనక్కి తగ్గేవాడు కాదు.
అయితే, ఆ తర్వాతి కాలంలో కోహ్లీ కాస్త పరిణతితో ప్రత్యర్థికి బదులిస్తున్నాడు. 2012లో ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా విరాట్ కోహ్లీ అక్కడి అభిమానులతో వ్యవహరించిన తీరు అతని కెరీర్‌లో ఓ మచ్చగా మిగిలిపోయింది. వివరాల్లోకి వెళితే....

ఆస్ట్రేలియా పర్యటనకు టీమిండియా
2012లో ధోని నాయకత్వంలోని టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది. ఈ పర్యటనకి వెళ్లిన భారత జట్టులో సభ్యుడిగా ఉన్న విరాట్ కోహ్లీ బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తుండగా.. అతడిని ఆసీస్ అభిమానులు కవ్వించే ప్రయత్నం చేశారు. దీంతో సహనం కోల్పోయిన విరాట్ కోహ్లీ వారిని ఉద్దేశించి తన ఎడమచేతి మధ్య వేలుని చూపించాడు.

కోహ్లీ చర్య అప్పట్లో పెద్ద వివాదాస్పదం
ఇది అక్కడి క్రికెట్ అభిమానులకు కోపం తెప్పించగా కోహ్లీ చర్య అప్పట్లో పెద్ద వివాదాస్పదమైంది. ఈ ఘటన అప్పట్లో ఆసీస్ పతాక శీర్షికల్లో నిలిచింది. కోహ్లీ చర్యకు గాను శిక్ష పడుతుందని అంతా భావించారు. కానీ.. ఆ మ్యాచ్ రిఫరీ.. ఆ అంశాన్ని సీరియస్‌గా తీసుకోకపోవడంతో.. తాను శిక్ష నుంచి బయటపడ్డానని కోహ్లీ తాజాగా వెల్లడించాడు.

టెస్టులో ఆరోజు ముగిసిన తర్వాత
"టెస్టులో ఆరోజు ముగిసిన తర్వాత.. మరుసటి రోజు మ్యాచ్ రిఫరీ రంజన్ నన్ను తన రూముకి పిలిపించాడు. నేను అక్కడికి వెళ్లి ఏం తప్పు చేయని వ్యక్తిలా నిలుచున్నాను. దీంతో అతను నావైపు చూసి.. నిన్న బౌండరీ లైన్ వద్ద ఏం జరిగింది? అని ప్రశ్నించాడు. ఏం జరగలేదు. సరదాగా చేశాను అని బదులిచ్చా. వెంటనే.. అతను నా ముందుకి ఓ న్యూస్ పేపర్ విసిరాడు" అని కోహ్లీ అన్నాడు.

దయచేసి నాపై నిషేధం విధించకండి అని చెప్పేసి వచ్చేశా
"అక్కడ నేను ముందు రోజు వేలు చూపించిన ఫొటో మొదటి పేజీలో పెద్దగా ప్రచురితమై ఉంది. దీంతో తప్పుని గ్రహించిన నేను క్షమాపణ చెప్పి.. దయచేసి నాపై నిషేధం విధించకండి అని చెప్పేసి వచ్చేశా. అప్పటికి నేను యువకుడు కావడంతో అదో పిల్ల చేష్టగా అతను పెద్ద మనసుతో అర్థం చేసుకున్నారు" అని కోహ్లీ వివరించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications