For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వారిద్దరి నుంచి ఎన్నో విషయాలు: శిఖర్ ధావన్

IPL 2019 : Dhawan Says I’m Learning A Lot From Ponting,Ganguly And Will Take It To World Cup
 I’m learning a lot from Ponting, Ganguly and will take it to the World Cup: Shikhar Dhawan

హైదరాబాద్: మాజీ క్రికెట్ దిగ్గజాలు రికీ పాంటింగ్, సౌరవ్ గంగూలీ నుంచి తాను ఎంతో నేర్చుకుంటున్నానని టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2019 సీజన్‌లో శిఖర్ ధావన్ ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తోన్న సంగతి తెలిసిందే. మరోవైపు ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ దిగ్గజం రికీ పాంటింగ్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు హెడ్ కోచ్‌గా వ్యవహారిస్తుండగా.... సౌరవ్ గంగూలీ ఇదే జట్టుకు సలహాదారుగా ఉన్నారు.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

ధావన్ మాట్లడుతూ

ధావన్ మాట్లడుతూ

ఈ నేపథ్యంలో ధావన్ మాట్లాడుతూ "రికీ పాంటింగ్, సౌరవ్ గంగూలీ... ప్రస్తుతం వీరిద్దరితో కలిసి పనిచేస్తున్నాను. ఈ ఇద్దరూ అద్భుతమైన కెప్టెన్లు. ఈ ఇద్దరితో కలిసి దగ్గరగా పనిచేయడంతో వారు ఆడే సమయంలో ఆటను ఏ విధంగా సమీక్షించేవారో తెలుసుకునే అవకాశం కలిగింది" అని చెప్పుకొచ్చాడు.

ఐపీఎల్‌తో పాటు వరల్డ్‌కప్‌లో

ఐపీఎల్‌తో పాటు వరల్డ్‌కప్‌లో

"ఈ ఇద్దరి నుంచి ఇప్పటికే క్రికెట్‌కు సంబంధించిన విషయాలను నేర్చుకున్నాను. ఇవి నాకు సాయపడుతున్నాయి. ఇందుకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నా. వారి వద్ద నుంచి ఏవైతే విషయాలను నేర్చుకున్నానో అవి ఐపీఎల్‌తో పాటు ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న వరల్డ్‌కప్‌లో కూడా ఆచరణలో పెడతాను" అని ధావన్ అన్నాడు.

పృథ్వీషాతో కలిసి ధావన్ ఓపెనింగ్ ఇన్నింగ్స్‌

పృథ్వీషాతో కలిసి ధావన్ ఓపెనింగ్ ఇన్నింగ్స్‌

ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరుపున పృథ్వీషాతో కలిసి ధావన్ ఓపెనింగ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పృథ్వీషాపై ధావన్ ప్రశంసల వర్షం కురిపించాడు. "19 ఏళ్ల వయసులోనే పృథ్వీ షా టీమిండియాకు ఆడటం తన జీవితంలోనే సాధించిన అతిపెద్ద విజయం. ముఖ్యంగా భారత్‌లాంటి దేశాల్లో ఎక్కువమంది బ్యాట్స్‌మెన్లు ఉంటారు" అని ధావన్ తెలిపాడు.

షాలో మంచి టాలెంట్ ఉంది

షాలో మంచి టాలెంట్ ఉంది

"అతడిలో మంచి టాలెంట్ ఉందని, రాబోయే రోజుల్లో భారత్ తరుపున అతడు అద్భుతాలు సృష్టించడం ఖాయం" అని ధావన్ చెప్పుకొచ్చాడు. కాగా, గతేడాది రాజ్‌కోట్ వేదికగా వెస్టిండిస్‌తో జరిగిన రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ లో అరంగేట్రం చేసిన పృథ్వీ షా తొలి టెస్టులోనే సెంచరీ సాధించిన ఆటగాడిగా అరుదైన ఘనత సాధించాడు.

Story first published: Thursday, April 25, 2019, 14:59 [IST]
Other articles published on Apr 25, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+