
నేను కింగ్‌ని అందుకే పంజాబ్ జట్టుకు ఆడుతున్నా:
ఐపీఎల్ వేలం జరుగుతుండగా రెండో రోజు ఆఖరి సమయంలో క్రిస్ గేల్ ను కొనుగోలు చేయడంపై ఆయన ఉద్రేకానికి లోనైయ్యారా అని అడిగిన ప్రశ్నకు ఇలా స్పందించారు. ప్రతి క్రికెటర్ అన్ని ఫార్మాట్ లను వదిలేయాల్సిన రోజు ఒక్కటి వస్తది. దానికి సిద్ధంగా ఉండాలి. ఆ విషయాన్ని అర్థం చేసుకున్నాను. కానీ, చివర్లో పంజాబ్ జట్టు నన్ను కొనుగోలు చేసింది. పంజాబ్ జట్టుకు ఆడుతుండటాన్ని గొప్పగా భావిస్తున్నాను.

గతేడాది బెంగళూరుకు ఇప్పుడు పంజాబ్‌కు:
గతేడాది బెంగళూరు జట్టుకు ఆడాను. ఈ సారి కూడా ఆడేందుకు ఏ అభ్యంతరం చెప్పలేదు. కానీ, వాళ్లు రిటైన్‌డ్ జాబితాలో నన్ను ఉంచలేదు. అప్పుడే అర్థమైంది. నేను వాళ్లతో ప్రయాణించేందుకు వాళ్లు సుముఖంగా లేరు అని. వేరే జట్టు కోసం ఎదురుచూశా. అప్పటికీ రెండు రౌండ్లు అయిపోయాయి. ఎవ్వరూ కొనుగోలు చేయకపోవడంతో.. బీపీఎల్, సీపీఎల్‌లలో ఆడిన ఘనత సరిపోతుంది. ఐపీఎల్ సెలక్ట్ కాకపోయినా పరవాలేదనుకున్నా. వాళ్లలెవరికో నేనేంటో చూపించుకోవాల్సిన పనిలేదు. నా రికార్డులే చెప్తాయి.

ఇంత వయస్సులో కూడా శరీరానికి ఇంతటి ఫిట్‌నెస్ ఎలా:
పెద్ద కష్టమైన పనేం కాదు. శరీరాన్ని మంచి షేప్‌లో ఉంచుకోవాలి. దాదాపుగా సహజంగానే నా శరీరం మంచి షేప్ లో ఉంటుందనుకోండి(నవ్వుతూ). అయినా దీని కోసం ఆహార అలవాట్లు మార్చుకుంటాను. స్ప్రింగ్ చికెన్ ఎక్కువగా తీసుకోను. అనుభవాన్నంతా ఉపయోగించి ఆటతీరు మరింత మెరుగ్గా ప్రదర్శనిచ్చేందుకు కష్టపడతాను.

ఇప్పటి వరూ టీ 20రికార్డులను ఎన్నో గెలుచుకున్నారు మరి తర్వాత:
ప్రస్తుతం నా ముందున్నది కేవలం రికార్డులే కాదు. ఐపీఎల్ ట్రోఫీ, ఇంకా వచ్చే ఏడాది రానున్న వరల్డ్ కప్. ఐపీఎల్ 11సీజన్ కు పంజాబ్ జట్టు విజేత కావాలి. వచ్చే ఏడాది జరగనున్న వరల్డ్ కప్ లో వెస్టిండీస్ విజేతగా నిలవాలి. నాకు తెలుసు వరల్డ్ కప్ టోర్నీకి వెళ్లేందుకు మేము క్వాలిఫైయర్స్ మ్యాచ్ ఆడాల్సి వచ్చింది. కప్ గెలుచుకోవాలిన గట్టి పట్టుదలతో ఉన్నాం.

మీరెప్పుడు:
సహచరుడు బ్రావో తమిళ్ సినిమాలో కనిపించాడు మరి
చాలా వరకూ ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. కానీ, మంచి కథ దొరకాలి అని ఆగుతున్నా. నేను సినిమా నటుడినే ఇక్కడ సినిమాల్లో కనిపించడంతో కొత్తదనం ఏమీ కనిపించదు.
ఇక గేల్ ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో ఆడింది నాలుగు మ్యాచ్లే అయినప్పటికీ, 252 పరుగులు చేసి, పొట్టి క్రికెట్‌లో తానెంత ముఖ్యమో నిరుపించుకున్నాడు.


Click it and Unblock the Notifications












