పథకం ప్రకారమే!: జంపా బౌలింగ్‌లో హ్యాట్రిక్ సిక్సర్లను బాదడంపై పాండ్యా
హైదరాబాద్: బ్యాటింగ్, బౌలింగ్‌లో రాణించిన తాను.. ఫీల్డింగ్‌లోనూ కూడా రాణించి ఉంటే బాగుండేదని ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా అన్నాడు. చెన్నై వేదికగా ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో పాండ్యా అద్భుత ప్రదర్శన చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన సంగత తెలిసిందే.
బ్యాటింగ్‌లో 66 బంతుల్లో 83 పరుగులు చేసిన పాండ్యా.. ఆ తర్వాత బౌలింగ్‌లో 2 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. దీంతో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుని సొంతం చేసుకున్నాడు. ఈ సందర్భంగా పాండ్యా మాట్లాడుతూ బ్యాటింగ్, బౌలింగ్‌లో రాణించిన తాను.. ఫీల్డింగ్‌లోనూ తాను రాణించి ఉంటే.. తన ఆటతీరు సంపూర్తి అయ్యేదని అన్నాడు.
'నాకు ఇది చాలామంచిరోజు. కొన్ని క్యాచ్‌లు కూడా పట్టి ఉంటే బాగుండేది. మొత్తానికి ఎంతో ఆనందంగా ఉంది' అని పాండ్యా అన్నాడు. గడిచిన కొన్నాళ్లలో తానేమీ పెద్దగా మారలేదని, అభిమానులే తనను భిన్నంగా చూస్తుండొచ్చునని పాండ్యా అభిప్రాయపడ్డాడు.
'పెద్దగా మారిందేమీ లేదని నేను అనుకుంటున్నా. నేను పాత హార్థిక్‌నే. కానీ గత ఏడాది కన్నా కొంచెం శాంతంగా మారిపోయి ఉంటాను. కానీ, ప్రజలే నా గురించి భిన్నంగా అనుకుంటున్నారేమో.. నేను మాత్రం నా ఆటపైనే దృష్టి పెట్టాలనుకుంటున్నా' అని పాండ్యా తెలిపాడు.

జంపాని హ్యాట్రిక్ సిక్సర్లు బాదడంపై
ఇక ఆసీస్ స్పిన్నర్ ఆడమ్ జంపాని హ్యాట్రిక్ సిక్సర్లు బాదడంపై అతడిని ముందుగానే టార్గెట్ చేయాలని తాను, ధోని అనుకున్నట్లు పాండ్యా పేర్కొన్నాడు. 'జంపా బౌలింగ్‌కు వస్తున్నాడని నాకు తెలుసు. అతని ఓవర్‌లో పరుగులు పిండుకోవాలని మేం ప్లాన్ చేసుకున్నాం. ఆ దిశగా పరుగులు రాబట్టడం హెల్ప్ అయింది' పాండ్యా చెప్పాడు.

సిక్సర్‌తోనే హాఫ్ సెంచరీ చేసిన పాండ్యా
తొలి వన్డేలో పాండ్యా సిక్సర్‌తోనే హాఫ్ సెంచరీ సాధించడం విశేషం. ఆడమ్ జంపా వేసిన 37వ ఓవర్‌లో అతడు వరుసగా మూడు సిక్సర్లు బాది వన్డేల్లో మూడో హ్యాట్రిక్ సిక్సర్లు నమోదు చేశాడు. ఆ ఓవర్ రెండో బంతిని బౌండరీకి తరలించిన అతడు తర్వాతి మూడు బంతుల్లో మూడు భారీ సిక్సర్లు బాదాడు.

జంపా బౌలింగ్‌లోనే 83 పరుగుల వద్ద అవుటైన పాండ్యా
ఈ క్రమంలో రెండో సిక్సర్‌తో పాండ్యా హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఆ తర్వాత కూడా దూకుడుగానే ఆడుతూ చెత్త బంతులను బౌండరీలకు తరలిస్తూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఆ తర్వాత జట్టు స్కోరు 205 పరుగుల వద్ద ఆడమ్ జంపా బౌలింగ్‌లో పాండ్యా (83) జేమ్స్ ఫల్కనర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు.

ఐదు వన్డేల సిరీస్‌లో భారత్ బోణి
ఇదిలా ఉంటే ఆస్ట్రేలియాతో ఐదు వన్డేల సిరీస్‌లో భారత్ బోణి చేసింది. చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో ఆదివారం జరిగిన తొలి వన్డేలో భారత జట్టు ఘన విజయం సాధించింది. డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం ఆసీస్‌పై భారత్ 26 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంలో ఐదు వన్డేల సిరిస్‌లో భారత్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది.

రెండు వికెట్లు తీసిన పాండ్యా
164 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 21వ ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 137 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 281 పరుగులు చేసింది. వర్షం కారణంగా మ్యాచ్‌ను 21 ఓవర్లకు కుదించి ఆసీస్ విజయ లక్ష్యాన్ని 164 పరుగులకు నిర్ధారించారు. భారత బౌలర్లలో చాహల్ 3, కుల్దీప్ యాదవ్ 3, హార్దిక్ పాండ్యా 2 వికెట్లు తీశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications