రసెల్‌కు బౌలింగ్ వేయకపోవడం అదృష్టమన్న కుల్దీప్


హైదరాబాద్: కేకేఆర్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ ఆండ్రీ రస్సెల్‌కు బౌలింగ్ వేయకపోవడం తన అదృష్టమని చెప్పుకొచ్చాడు కోల్‌కతా నైట్‌రైడర్స్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్. ఐపీఎల్ 2019 సీజన్‌లో ఆండ్రీ రస్సెల్ అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. ఇప్పటివరకు కోల్‌కతా ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రసెల్ వల్లే రెండు మ్యాచ్‌ల్లో ఆ జట్టు విజయం సాధించడం విశేషం.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
ఈ నేపథ్యంలో కుల్దీప్ యాదవ్ మాట్లాడుతూ "ఆటను మలుపుతిప్పే ఆటగాడు అందరికీ అవసరమే. ఆ విభాగంలో మాకు రసెల్ ఉన్నాడు. మ్యాచ్‌ను మావైపునకు తిప్పే క్రికెటర్ అతడు. అతడు జోరు మీదున్నప్పుడు ఆపడం చాలా కష్టం. అతడికి బౌలింగ్ వేయకపోవడం నా అదృష్టం. అతడు ఏ బౌలర్ ఎకానమీ రేటునైనా విధ్వంసం చేయగలడు" అని చెప్పాడు.
ప్రస్తుతం మా ఆటతీరని చూస్తుంటే, ఈ సీజన్‌లో కోల్‌కతా విజేతగా నిలుస్తుందని కుల్దీప్ యాదవ్ ధీమా వ్యక్తం చేశాడు. ఇప్పటివరకు ఈ సీజన్‌లో మూడు మ్యాచ్‌లాడిన ఆండ్రీ రసెల్ 79.50 యావరేజితో 159 పరుగులు చేశాడు. స్ట్రైక్‌రేట్ 248.43గా ఉంది. 15 సిక్సర్లు బాది ఈ సీజన్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా నిలిచాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications