
లెజెండరీ వికెట్లు తీయడం అదృష్టం:
'కోహ్లీ, డివిలియర్స్‌ల వికెట్లు తీయడం అదృష్టంగా భావిస్తున్నా. ఈ రోజు నేను చాలా సంతోషంగా ఉన్నా. ఇలా వికెట్లు తీయడం ప్రతిరోజూ సాధ్యం కాదు.. ఇది నా క్రీడా ప్రయాణంలో మర్చిపోలేని రోజు. లెజెండరీ ఆటగాళ్ల వికెట్లు తీసిన సందర్భంను చిరస్మరణీయంగా గుర్తుంచుకుంటా. ఈ రోజు నా ప్రణాళికలు అమలయినందుకు నేను అదృష్టవంతున్ని' అని గోపాల్ తెలిపారు.

బెంగళూరుపై ఒత్తిడి పెంచాం:
'మొదటి 6 ఓవర్లలో బెంగళూరుపై చాలా ఒత్తిడిని సృష్టించాం. వారు 65-70 పరుగులు చేయలేకపోయారు. ఫస్ట్ క్లాస్ మ్యాచుల్లో రాణించిన అనుభవం నాలో విశ్వాసాన్ని నింపింది. అక్కడి కంటే కూడా ఐపీఎల్‌లోనే బాగా ఆడుతున్నానని భావిస్తున్నా. రిస్ట్ స్పిన్నర్లు బంతిని రెండు వైపులా స్పిన్ చేయగలరు, బహుశా అదే ఈ మ్యాచ్‌లో నాకు అడ్వాంటేజ్ అయ్యిందేమో' అని శ్రేయస్ గోపాల్ పేర్కొన్నారు.

4 ఓవర్లు.. 12 పరుగులు.. 3 వికెట్లు
మంగళవారం సవాయ్ సింగ్ మైదానంలో బెంగళూరులో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ 7 వికెట్ల తేడాతో గెలుపొంది. దీంతో ఐపీఎల్ సీజన్ 12లో రాజస్తాన్ బోణీ కొట్టింది. రాజస్థాన్ లెగ్ స్పిన్నర్ శ్రేయస్ గోపాల్ అద్భుత ప్రదర్శన చేసి ఇన్నింగ్స్ ఆదిలోనే బెంగళూరు టాప్ ఆటగాళ్లను పెవిలియన్ చేర్చాడు. తాను వేసిన తొలి ఓవర్‌లోనే కోహ్లీని క్లీన్‌బౌల్డ్ చేశాడు. ఆ తర్వాతి ఓవర్లో డివిలియర్స్‌ను రిటర్న్ క్యాచ్‌తో పెవిలియన్ చేర్చాడు. అనంతరం హెట్‌మైర్ (1)ను ఔట్ చేసి దెబ్బ కొట్టాడు. తన కోటా 4 ఓవర్లలో కేవలం 12 పరుగులు ఇచ్చి 3 కీలక వికెట్లు తీసాడు. దీంతో బెంగళూరు జట్టు 158 పరుగుల సాధారణ స్కోర్ చేసింది. అనంతరం రాజస్థాన్ 7 వికెట్ల తేడాతో గెలిచింది. శ్రేయస్ గోపాల్ 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు అందుకున్నాడు.


Click it and Unblock the Notifications













