హైదరాబాద్: తన తమ్ముడు హార్దిక్ పాండ్యా అన్నట్టుగానే మాట నిలుపుకున్నాడని చెప్పుకొచ్చాడు కృనాల్ పాండ్యా. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ఆస్ట్రేలియాతో ఇటీవలే ముగిసిన వన్డే సిరిస్‌లో హార్దిక్ పాండ్యా అద్భుత ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే.
అటు బ్యాటుతోనూ ఇటు బంతితో రాణించి 'మ్యాన్ ఆఫ్ ది సిరీస్' అవార్డుని సైతం దక్కించుకున్నాడు. ఈ వన్డే సిరిస్‌కు ముందు కృనాల్ పాండ్యాతో హార్దిక్ పాండ్యా ఓ మాట చెప్పాడంట. 'ఆసీస్‌తో జరిగే మ్యాచ్‌ల్లో విజృంభిస్తానని సిరీస్‌కు ముందు హార్దిక్ నాతో అన్నాడు. అన్నట్టుగానే మాట నిలుపుకున్నందుకు నేను గర్వపడుతున్నా' అని కృనాల్ పాండ్యా ట్వీట్ చేశాడు.

ఈ ట్వీట్‌లో తనకు వచ్చిన ట్రోఫీలతో హార్దిక్ పాండ్యా ఫోజులివ్వడాన్ని మనం చూడొచ్చు. ఆసీస్‌తో జరిగిన ఐదు వన్డేల సిరీస్‌లో హార్దిక్ 55.50 సగటుతో 222 పరుగులు చేశాడు. 6.06 ఎకానమీ రేటుతో 6 వికెట్లు తీశాడు. ఈ సిరిస్‌లో హార్దిక్ పాండ్యా అద్భుత ప్రదర్శన చేయడంతో కెప్టెన్ కోహ్లీ సైతం అతడిని ప్రశంసలతో ముంచెత్తాడు.