For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భారత్ టెస్టు సిరీస్ గెలవకపోతే ఆశ్చర్యపోతా: షేన్ వాట్సన్

Ill be surprised if India doesnt win Test series vs England: Shane Watson

హైదరాబాద్: అసలైన సిరీస్‌కు సర్వం సిద్ధమైన వేళ.. టీమిండియాపై ఖండాంతరంగా గెలుస్తుందనే విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు క్రికెటర్లు. ఈ సంవత్సరారంభంలో ముగిసిన ఐపీఎల్ 2018లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించిన షేన్ వాట్సన్ టీమిండియా టెస్టు సిరీస్‌ను గెలుచుకోలేకపోతే ఆశ్చర్యపోతానంటున్నాడు. ప్రస్తుతం వాట్సన్‌ భారత్‌లో పర్యటిస్తున్న వాట్సన్.. భారత్‌-ఇంగ్లాండ్‌ మధ్య ప్రారంభంకాబోయే టెస్టు సిరీస్‌ గురించి మాట్లాడాడు.

1
42374

గతంలో భారత జట్టు ఎలా ఆడిందో అవసరం లేదు

‘ఇంగ్లాండ్‌తో టెస్టులు ఆడేందుకు భారత్‌ జట్టు ఎంపికకు చాలా అవకాశాలు ఉన్నాయి. గతంలో భారత జట్టు ఇంగ్లిష్‌ గడ్డపై ఎలా ఆడింది, ఎన్ని విజయాలు సాధించగలిగిందో.. ఇప్పుడు పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో పర్యటిస్తోన్న భారత జట్టు తప్పకుండా సిరీస్‌ గెలుస్తోందన్న నమ్మకం నాకు ఉంది. ఎందుకంటే జట్టులోని ఆటగాళ్లు ప్రత్యర్థులకు ధీటుగా సమాధానం చెప్పగలరు'.

గెలవకపోతే అప్పుడు ఆశ్చర్యపోతా..!

గెలవకపోతే అప్పుడు ఆశ్చర్యపోతా..!

'టెస్టు సిరీస్‌ గెలవకపోతే అప్పుడు ఆశ్చర్యపోతా. 2014లో ఇంగ్లాండ్‌ పర్యటన ద్వారా కోహ్లీకి నేర్చుకునే అవకాశం దక్కిందనే చెప్పుకోవాలి. అతనో టెక్నికల్‌ ఆటగాడు. ఎలాంటి పరిస్థితులకైనా సులువుగా అలవాటు పడిపోతాడు. ఆస్ట్రేలియాలో నేను అతడి నుంచి అది బాగా గమనించాను. కేఎల్‌ రాహుల్‌ ఆడుతుంటే చూడటం చాలా ఇష్టం. ఫాస్ట్‌ బౌలర్లను చాలా తెలివిగా, సులువుగా ఎదుర్కొంటాడు.'

బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శిస్తాడు

బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శిస్తాడు

'అన్ని రకాల షాట్లను ఆడేందుకు ప్రయత్నిస్తాడు. బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శిస్తాడు. ఇక ఓపెనర్ల విషయానికొస్తే ధావన్, మురళీ విజయ్, కేఎల్ రాహుల్ ఉండటం టీమిండియాకు మంచి బలం. కానీ, వారిలో ఎవరిని ఎంచుకుంటరానేది కెప్టెన్‌పై ఆధారపడి ఉంటుంది. ఇక అశ్విన్ ఓ గొప్ప బౌలర్. ఒక్కోసారి తన బ్యాట్‌తో కూడా సత్తా చాటగలడు. టెస్టు సిరీస్‌లో కుల్దీప్ రాణిస్తాడని అంత బలంగా చెప్పలేను.'

ఎడ్జ్‌బాస్టన్‌లో తొలి టెస్టు.. ఇంగ్లాండ్‌కు 1000వది:

ఎడ్జ్‌బాస్టన్‌లో తొలి టెస్టు.. ఇంగ్లాండ్‌కు 1000వది:

'బౌలింగ్ విభాగంలో ఇరువైపులా సమాన ప్రత్యర్థులున్నప్పటికీ బ్యాటింగ్ విభాగం టీమిండియాదే బలంగా ఉందనుకుంటాను' అని వాట్సన్‌ చెప్పాడు. భారత్‌-ఇంగ్లాండ్‌ మధ్య ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ ఈ రోజు ప్రారంభంకానుంది. బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌లో ఇరు జట్ల మధ్య తొలి టెస్టు జరగనుంది. ఈ టెస్టు ఇంగ్లాండ్‌కు 1000వది కావడం విశేషం.

Story first published: Wednesday, August 1, 2018, 14:24 [IST]
Other articles published on Aug 1, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+