రోహిత్ శర్మ కొట్టే 'నటరాజ్ షాట్' బాగా ఇష్టం: కపిల్‌ దేవ్

Kapil Dev Says ‘I Liked How Rohit Sharma Plays The Natraj Shot’ || Oneindia Telugu
I liked how Rohit Sharma plays the Natraj shot says Kapil Dev

హైదరాబాద్: ఇప్పటివరకూ భారత్‌ క్రికెట్‌ జట్టు రెండుసార్లు మాత్రమే వన్డే ప్రపంచకప్‌ను ముద్దాడింది. హరియాణా హరికేన్‌ కపిల్‌ దేవ్‌ నేతృత్వంలోని టీమిండియా తొలి ప్రపంచకప్‌ను అందుకుని యావత్‌ దేశ కలను సాకారం చేసింది. 1983లో అండర్‌ డాగ్‌గా మెగా టోర్నీలోకి అడుగుపెట్టిన భారత్.. ఫేవరెట్‌గా బరిలోకి దిగిన వెస్టిండీస్‌ను మట్టికరిపించి ట్రోఫీని సొంతం చేసుకుంది. ఇక కపిల్‌ దేవ్‌ కెప్టెన్‌గా, ఆల్‌రౌండర్‌గా జట్టును ముందుండి నడిపించి ఎన్నో అపూర్వ విజయాలను అందించారు.

'టీమిండియా పటిష్ఠమైన జట్టు.. గెలవాలంటే సీనియర్లు బాధ్యత తీసుకోవాలి'

రోహిత్ 'నటరాజ్ షాట్' ఇష్టం:

రోహిత్ 'నటరాజ్ షాట్' ఇష్టం:

కపిల్ దేవ్ సోమవారం తన 61వ పుట్టినరోజుని జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడుతూ పలు విషయాలను పంచుకున్నారు. 'ప్రస్తుతం నటరాజ్ షాట్‌ని ఎవరు బాగా ఆడుతున్నారు అని ఎప్పుడూ పరిశీలించలేదు. గతంలో నేను ఆడిన తీరు కంటే.. ఇప్పుడు చాలా మంది బ్యాట్స్‌మన్‌ ఆ షాట్‌ని మెరుగ్గానే ఆడుతున్నారు. అయితే భారత ఓపెనర్ రోహిత్ శర్మ మాత్రం నటరాజ్ షాట్‌ని లాఘవంగా ఆడటాన్ని రెండుసార్లు చూశా. నాకు అతని షాట్ బాగా నచ్చింది. ఈ షాట్ మిగతావారు కూడా ఆడుతున్నారు. అయితే ఇప్పుడు ఉన్న క్రికెటర్లు చాలా స్మార్ట్‌గా ఆడుతున్నారు' అని కపిల్‌దేవ్ తెలిపారు.

ప్రత్యేక అభిమానులు:

ప్రత్యేక అభిమానులు:

అప్పటి రోజుల్లో కపిల్‌ దేవ్ ఆడే నటరాజ్ షాట్‌కి ప్రత్యేకంగా అభిమానులున్నారు. శరీరంపైకి దూసుకొచ్చే బంతిని లాఘవంగా నటరాజ్ స్టయిల్‌లో ఒక కాలు పైకెత్తి మిడ్‌వికెట్ దిశగా బౌండరీకి తరలించేవారు. ఈ షాట్ ద్వారా కపిల్ సునాయాసంగా పరుగులు రాబట్టేవారు. ప్రస్తుతం ఆ నటరాజ్ షాట్‌ని రోహిత్ శర్మతో సహా చాలా మంది ఆడుతున్నారు.

138 బంతుల్లో 175 పరుగులు:

138 బంతుల్లో 175 పరుగులు:

1983 ప్రపంచకప్‌లో జింబాబ్వేపై కపిల్‌ దేవ్ 138 బంతుల్లో 175 పరుగులతో అజేయంగా నిలిచారు. ఈ మ్యాచ్‌లో తొమ్మిదో వికెట్‌కు సయ్యద్‌ కిర్మాణి (24*)తో కలిసి అతడు 126 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ ఇన్నింగ్సే టీమిండియాను 1983 ప్రపంచకప్‌ ఫైనల్‌కు చేర్చింది. ఆ తర్వాత ఫైనల్లో ఏం జరిగిందో మనందరికీ తెలిసిందే.

క‌పిల్ దేవ్ బ‌యోపిక్:

క‌పిల్ దేవ్ బ‌యోపిక్:

కపిల్ స్టోరీ ఆధారంగా '83' సినిమాని రూపొందిస్తోన్నారు. ఈ సినిమాని హిందీ, తెలుగుతో పాటు పలు భాషల్లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. క‌పిల్ దేవ్ పాత్ర‌ని బాలీవుడ్ స్టార్ హీరో ర‌ణ్‌వీర్ సింగ్ పోషిస్తున్నారు. దీపిక పదుకొణె ర‌ణ్‌వీర్‌కి భార్య‌గా నటిస్తుంది. క్రికెటర్ కృష్ణ‌మాచారి శ్రీకాంత్ పాత్ర‌లో త‌మిళ న‌టుడు జీవా న‌టిస్తున్నాడు. 2020 ఏప్రిల్ 10న‌ గుడ్ ఫ్రైడే రోజు క‌పిల్ దేవ్ బ‌యోపిక్ చిత్రంని విడుద‌ల చేయ‌నున్నారు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Tuesday, January 7, 2020, 15:41 [IST]
Other articles published on Jan 7, 2020
POLLS
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Mykhel sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Mykhel website. However, you can change your cookie settings at any time. Learn more