
రోహిత్ 'నటరాజ్ షాట్' ఇష్టం:
కపిల్ దేవ్ సోమవారం తన 61వ పుట్టినరోజుని జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడుతూ పలు విషయాలను పంచుకున్నారు. 'ప్రస్తుతం నటరాజ్ షాట్‌ని ఎవరు బాగా ఆడుతున్నారు అని ఎప్పుడూ పరిశీలించలేదు. గతంలో నేను ఆడిన తీరు కంటే.. ఇప్పుడు చాలా మంది బ్యాట్స్‌మన్ ఆ షాట్‌ని మెరుగ్గానే ఆడుతున్నారు. అయితే భారత ఓపెనర్ రోహిత్ శర్మ మాత్రం నటరాజ్ షాట్‌ని లాఘవంగా ఆడటాన్ని రెండుసార్లు చూశా. నాకు అతని షాట్ బాగా నచ్చింది. ఈ షాట్ మిగతావారు కూడా ఆడుతున్నారు. అయితే ఇప్పుడు ఉన్న క్రికెటర్లు చాలా స్మార్ట్‌గా ఆడుతున్నారు' అని కపిల్‌దేవ్ తెలిపారు.

ప్రత్యేక అభిమానులు:
అప్పటి రోజుల్లో కపిల్ దేవ్ ఆడే నటరాజ్ షాట్‌కి ప్రత్యేకంగా అభిమానులున్నారు. శరీరంపైకి దూసుకొచ్చే బంతిని లాఘవంగా నటరాజ్ స్టయిల్‌లో ఒక కాలు పైకెత్తి మిడ్‌వికెట్ దిశగా బౌండరీకి తరలించేవారు. ఈ షాట్ ద్వారా కపిల్ సునాయాసంగా పరుగులు రాబట్టేవారు. ప్రస్తుతం ఆ నటరాజ్ షాట్‌ని రోహిత్ శర్మతో సహా చాలా మంది ఆడుతున్నారు.

138 బంతుల్లో 175 పరుగులు:
1983 ప్రపంచకప్‌లో జింబాబ్వేపై కపిల్ దేవ్ 138 బంతుల్లో 175 పరుగులతో అజేయంగా నిలిచారు. ఈ మ్యాచ్‌లో తొమ్మిదో వికెట్‌కు సయ్యద్ కిర్మాణి (24*)తో కలిసి అతడు 126 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ ఇన్నింగ్సే టీమిండియాను 1983 ప్రపంచకప్ ఫైనల్‌కు చేర్చింది. ఆ తర్వాత ఫైనల్లో ఏం జరిగిందో మనందరికీ తెలిసిందే.

కపిల్ దేవ్ బయోపిక్:
కపిల్ స్టోరీ ఆధారంగా '83' సినిమాని రూపొందిస్తోన్నారు. ఈ సినిమాని హిందీ, తెలుగుతో పాటు పలు భాషల్లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. కపిల్ దేవ్ పాత్రని బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ పోషిస్తున్నారు. దీపిక పదుకొణె రణ్‌వీర్‌కి భార్యగా నటిస్తుంది. క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ పాత్రలో తమిళ నటుడు జీవా నటిస్తున్నాడు. 2020 ఏప్రిల్ 10న గుడ్ ఫ్రైడే రోజు కపిల్ దేవ్ బయోపిక్ చిత్రంని విడుదల చేయనున్నారు.


Click it and Unblock the Notifications












