Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అనుష్క బాయ్ ఫ్రెండ్ అంటే..: కోహ్లీ అంటే ఇష్టమన్న బాలీవుడ్ నటి

ముంబై: అనుష్క శర్మ - విరాట్ కోహ్లీల ప్రేమ వ్యవహారం గురించి అందరికీ తెలిసిన విషయమే. విరాట్ కోహ్లీ పలుమార్లు మైదానం నుండే తన ప్రియురాలు అనుష్కకు ఫ్లయింగ్ కిస్‌లు ఇచ్చి అలరించాడు. కోహ్లీ, అనుష్కలు గాఢమైన ప్రేమలో ఉన్నారు. అలాంటి కోహ్లీని మరో బాలీవుడ్ హీరోయిన్ ఇష్టమని చెబుతోంది.

తనకు విరాట్ కోహ్లీ అంటే ఇష్టమని కంగనా రనౌత్ చెబుతోంది. కొద్ది రోజుల క్రితం ఓ కార్యక్రమంలో తనకు ఇష్టమైన క్రికెటర్ ఎవరు అని కంగనా రనౌత్‌ను అడగగా.. అనుష్క బాయ్ ఫ్రెండ్ అని చెప్పింది. అనుష్క బాయ్ ఫ్రెండ్ విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ అంటే తనకు చాలా అభిమానమని చెప్పింది. అంతేకాదు, అతనిని పొగడ్తలతో ముంచెత్తింది.

I like Anushka Sharma's boyfriend Virat Kohli: Kangana Ranaut

కాగా, భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మ మధ్య సంబంధం ఉన్న విషయం తెలిసిందే. గతంలో వారిద్దరు గప్‌చుప్‌గా బయట తిరిగినప్పటికీ, ఇటీవల వారు బహిరంగంగా తిరుగుతున్నారు. ఈ విషయమై అనుష్క శర్మ కొద్ది రోజుల క్రితం స్పందించారు.

తమ మధ్య ఉన్న రిలేషన్‌షిప్ గురించి మాట్లాడటం తనకు ఇష్టం ఉండదని, అది తమ వ్యక్తిగత జీవితమని, తమ పర్సనల్ జీవితాన్ని వినోదంగా చూడదల్చుకోలేదని ఆమె అన్నారు. అందుకే దాని గురించి తాను ఎవరితోను మాట్లాడదల్చుకోలేదని అభిప్రాయపడ్డారు.

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+