Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నాకు తెలుసు, నేనేం చేయగలనో!: మూడో టెస్టు ఓటమిపై జో రూట్

I know what I am capable of: Joe Root on 3rd Test loss to India

హైదరాబాద్: నాటింగ్ హామ్ వేదికగా భారత్‌తో జరిగిన మూడో టెస్టులో 203 పరుగుల తేడాతో ఓటమిపాలవడం తనను తీవ్ర నిరుత్సాహానికి గురిచేసిందని ఆ జట్టు కెప్టెన్ జో రూట్ ఆటగాళ్లతో పేర్కొన్నాడు. ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య నాలుగో టెస్టు సౌతాంప్టన్ వేదికగా ఆగస్టు 30 నుంచి ఆరంభం కానుంది.

తొలి ఇన్నింగ్స్‌లో దారుణంగా 161 పరుగులకే ఆలౌటవ్వడం, రెండో ఇన్నింగ్స్‌లోనూ తక్కువ స్కోరుకే బ్యాట్స్‌మెన్‌ వెనుదిరగటం ఆందోళన కలిగించే అంశమని జో రూట్ అభిప్రాయపడ్డాడు. మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో మిగతా బ్యాట్స్‌మెన్‌ విఫలమైనా బట్లర్‌-స్టోక్స్‌లు పోరాడిన తీరు అద్భుతమని జో రూట్ కొనియాడాడు.

వారిద్దరి నుంచి జట్టులోని మిగతా ఆటగాళ్లు పాఠాలు నేర్చుకోవాలని అన్నాడు. ఐదో వికెట్‌కు 169 పరుగుల జోడించి ఘోర ఓటమి నుంచి తప్పించే ప్రయత్నం చేశారని తెలిపాడు. టెస్టు గెలవాలంటే రెండు, మూడు బలమైన భాగస్వామ్యాలు నమోదు చేయాలని, మూడో టెస్టులో అది చేయలేకపోయామని అన్నాడు.

1
42377

మాజీ కెప్టెన్‌, సీనియర్‌ ఆటగాడు అలెస్టర్‌ కుక్‌పై తాను ఇంకా నమ్మకం ఉంచినట్లు కుక్ తెలిపాడు. కుక్‌ ఫామ్‌లోకి వస్తే తమ జట్టుకి ఇక తిరుగుండదని తెలిపాడు. ఇక, మూడో టెస్టులో గాయపడిన ఇంగ్లాండ్‌ కీపర్‌ జానీ బెయిర్‌ స్టో ఇంకా కోలుకోలేదు. దీంతో అతడిని నాలుగో టెస్టులో స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్‌గా సెలక్టర్లు ఎంపిక చేశారు.

అతడి స్థానంలో సౌతాంప్టన్ లోకల్ బాయ్ జేమ్స్ విన్సీని సెలక్టర్లు ఎంపిక్ చేసిన సంగతి తెలిసిందే.

Story first published: Friday, August 24, 2018, 19:53 [IST]
Other articles published on Aug 24, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+