'పెద్ద తప్పేం చేయలేదు, మళ్లీ అవకాశం వస్తుంది'

Posted By:

హైదరాబాద్: వన్డేల్లో తన పునరాగమనంపై తొందరేం లేదని, సమయం వచ్చినపుడు తప్పకుండా అవకాశం లభిస్తుందని టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్‌ అశ్విన్‌ అన్నాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న పరిమిత ఓవర్ల సిరిస్‌కు ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాతో పాటు రవిచంద్రన్ అశ్విన్‌ను సెలక్టర్లు పక్కన బెట్టిన సంగతి తెలిసిందే.

ఐదు వన్డేల సిరిస్‌లో యజువేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్ అద్భుతంగా రాణించడంతో జడేజా, అశ్విన్‌పై వేటుపడిందని వార్తలు ప్రధానంగా వినిపిస్తున్నాయి. పరిమిత ఓవర్ల మ్యాచ్‌లకు వీరి సేవలు అవసరం లేదని సెలక్టర్లు భావించారనే వార్తలు వచ్చాయి. ఈ విషయాన్ని అశ్విన్ వద్ద ప్రస్తావించగా తానేమీ పెద్ద తప్పు చేయలేదని, మళ్లీ అవకాశం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.

 అవకాశం నా తలుపు తడుతుంది

అవకాశం నా తలుపు తడుతుంది

‘ఏదో ఒక రోజు మళ్లీ అవకాశం నా తలుపు తడుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను పెద్ద తప్పేమీ చేయలేదు. ఒక్కసారి నాకు అవకాశం వస్తే దాన్ని నాకు అనుకూలంగా మార్చుకుంటాను' అని అశ్విన్ చెప్పాడు. ఇటీవలే ప్రారంభమైన రంజీ ట్రోఫీ ప్రచార కార్యక్రమంలో భాగంగా అశ్విన్ మీడియాతో మాట్లాడాడు.

స్టేడియంలో ఉన్న ప్రేక్షకుల కోసం ఆడలేదు

స్టేడియంలో ఉన్న ప్రేక్షకుల కోసం ఆడలేదు

రంజీ, అంతర్జాతీయ మ్యాచ్‌లను పోలుస్తూ 'నేనెప్పుడూ స్టేడియంలో ఉన్న ప్రేక్షకుల కోసం ఆడలేదు. ఐదో డివిజన్ మ్యాచ్‌లో ఆడినా నా ఆటను నేను ఆస్వాదిస్తాను. చాలా బాగా ఎంజాయ్ చేస్తాను. స్టేడియంలోని పరిస్థితులు సమస్య కాదు. సందర్భానుసారంగా నాలోని ఆటతీరును మారుస్తాను, ఆస్వాదిస్తాను. కాబట్టి ప్రస్తుతం నేనేమీ కోల్పోవడం లేదు' అని అశ్విన్ తెలిపాడు.

2019 వరల్డ్ కప్‌ను దృష్టిలో పెట్టుకునే

2019 వరల్డ్ కప్‌ను దృష్టిలో పెట్టుకునే

కాగా, 2019 వరల్డ్ కప్‌ను దృష్టిలో పెట్టుకుని అత్యుత్తమ జట్టు కోసం సెలక్టర్లు, కోచ్ రొటేషన్ పద్ధతిలో యువ ఆటగాళ్లకు అవకాశాలను కల్పిస్తున్నారు. ఈ క్రమంలోనే జడేజా, అశ్విన్‌కు విశ్రాంతినివ్వాలని కోచ్ రవిశాస్త్రి భావించారు.

 చాహల్, కుల్దీప్‌ల అద్భుత ప్రదర్శన

చాహల్, కుల్దీప్‌ల అద్భుత ప్రదర్శన

అదే సమయంలో వన్డేల్లో చాహల్, కుల్దీప్ అద్భుతంగా రాణిస్తుండటంతో కెప్టెన్ కోహ్లీ వారివైపే మొగ్గు చూపుతున్నాడు. వీరిద్దరూ చైనామన్ స్పిన్నర్లు. ప్రస్తుతం ఆసీస్‌తో జరుగుతున్న సిరిస్‌లో వీరిద్దరూ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇక, ఇప్పటి వరకు 111 వన్డేలాడిన అశ్విన్ 150 వికెట్లు తీశాడు.

Story first published: Tuesday, October 10, 2017, 10:35 [IST]
Other articles published on Oct 10, 2017

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి