నాలో బ్యాటింగ్ టాలెంట్ కూడా ఉంది: శార్దూల్ ఠాకూర్

హైదరాబాద్: బ్యాటింగ్ టాలెంట్ కూడా తనలో ఉందని టీమిండియా బౌలర్ శార్దూల్ ఠాకూర్ వెల్లడించాడు. కటక్ వేదికగా ఆదివారం వెస్టిండిస్‌తో జరిగిన మూడో వన్డేలో టీమిండియా 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌ కోహ్లీ ఔటైన తర్వాత జడేజాతో కలిసి పేసర్ శార్దూల్ ఠాకూర్‌ టీమిండియాకు విజయాన్ని అందించాడు.

మ్యాచ్ అనంతరం శార్దూల్ మాట్లాడుతూ "కోహ్లీ ఔటైన తర్వాత నేను ఒత్తిడికి లోనవుతానని భావించా. కానీ, రవీంద్ర జడేజా రూపంలో ఓ బ్యాట్స్‌మన్ క్రీజులోనే కుదురుకుని ఉన్నాడు. దీంతో బరిలోకి దిగిన వెంటనే బంతిని వదలకుండా బాదాలని నిర్ణయించుకున్నా. అదృష్టవశాత్తూ బంతి బ్యాట్‌కు కనెక్ట్‌ అయింది. బ్యాటింగ్‌ కూడా చేయగలనని నాకు తెలుసు" అని పేర్కొన్నాడు.

భారత్ నుంచి విరాట్ కోహ్లీ మాత్రమే: క్రికెట్ ఆస్ట్రేలియా ఈ దశాబ్దపు టెస్టు జట్టిదే

ఇక, ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్ చేయగలరా? అన్న ప్రశ్నకు "ఆ స్థానంలో బ్యాటింగ్‌ చేయగలను. జట్టుకు అవసరమైనప్పుడు నేను 20-30 పరుగులు సాధిస్తే ఎంతో సంతోషిస్తా. బ్యాటింగ్‌పై కూడా మరింత ప్రాక్టీస్ చేయాలి. నాకు అవకాశం ఇస్తే సద్వినియోగం చేసుకుంటా" అని శార్దూల్‌ తెలిపాడు.

ఒత్తిడిలో అద్భుతంగా బ్యాటింగ్‌ చేశాడు: జడేజాపై దాదా ప్రశంసల వర్షం

వీరిద్దరూ కలిసి ఏడో వికెట్‌కు అజేయంగా 30 పరుగులు జోడించడంతో మరో ఎనిమిది బంతులు మిగిలుండగానే టీమిండియా విజయాన్ని కైవసం చేసుకుంది. శార్దూల్ ఠాకూర్ అయితే రెండు ఫోర్లు, సిక్సర్‌ సాయంతో 6 బంతుల్లోనే 17 పరుగులు చేశాడు. ఫలితంగా విండీస్‌పై టీమిండియా నాలుగు వికెట్ల తేడాతో గెలిచి సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
 
Story first published: Monday, December 23, 2019, 18:01 [IST]
Other articles published on Dec 23, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X