నాలో బ్యాటింగ్ టాలెంట్ కూడా ఉంది: శార్దూల్ ఠాకూర్

హైదరాబాద్: బ్యాటింగ్ టాలెంట్ కూడా తనలో ఉందని టీమిండియా బౌలర్ శార్దూల్ ఠాకూర్ వెల్లడించాడు. కటక్ వేదికగా ఆదివారం వెస్టిండిస్‌తో జరిగిన మూడో వన్డేలో టీమిండియా 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ కోహ్లీ ఔటైన తర్వాత జడేజాతో కలిసి పేసర్ శార్దూల్ ఠాకూర్ టీమిండియాకు విజయాన్ని అందించాడు.
మ్యాచ్ అనంతరం శార్దూల్ మాట్లాడుతూ "కోహ్లీ ఔటైన తర్వాత నేను ఒత్తిడికి లోనవుతానని భావించా. కానీ, రవీంద్ర జడేజా రూపంలో ఓ బ్యాట్స్‌మన్ క్రీజులోనే కుదురుకుని ఉన్నాడు. దీంతో బరిలోకి దిగిన వెంటనే బంతిని వదలకుండా బాదాలని నిర్ణయించుకున్నా. అదృష్టవశాత్తూ బంతి బ్యాట్‌కు కనెక్ట్ అయింది. బ్యాటింగ్ కూడా చేయగలనని నాకు తెలుసు" అని పేర్కొన్నాడు.
వీరిద్దరూ కలిసి ఏడో వికెట్‌కు అజేయంగా 30 పరుగులు జోడించడంతో మరో ఎనిమిది బంతులు మిగిలుండగానే టీమిండియా విజయాన్ని కైవసం చేసుకుంది. శార్దూల్ ఠాకూర్ అయితే రెండు ఫోర్లు, సిక్సర్ సాయంతో 6 బంతుల్లోనే 17 పరుగులు చేశాడు. ఫలితంగా విండీస్‌పై టీమిండియా నాలుగు వికెట్ల తేడాతో గెలిచి సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications