ఏరా.. నేనే దొరికానా: పృథ్వీ షా, శివమ్ మావి.. ఆఫ్ ఫీల్డ్ ఫైట్

IPL 2021,DC vs KKR : Prithvi Shaw, Shivam Mavi ఆఫ్ ఫీల్డ్ ఫైట్ Viral ఏరా.. నేనే దొరికానా !

అహ్మదాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్.. 14వ ఎడిషన్‌లో ఢిల్లీ కేపిటల్స్.. దూసుకెళ్తోంది. మరో తిరుగులేని విజయాన్ని అందుకుంది. ఏ మాత్రం ఫామ్‌లో లేని కోల్‌కత నైట్ రైడర్స్‌తో మ్యాచ్‌ను వన్‌సైడ్ చేసింది. ఏడు మ్యాచుల్లో అయిదింట్లో గెలుపొందిన రిషభ్ పంత్ టీమ్.. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. టైటిల్ హాట్ ఫేవరెట్‌గా ఈ సీజన్‌ను ఆరంభించిన ఢిల్లీ కేపిటల్స్.. దానికి తగినట్టుగా ఆటతీరును కనపరుస్తోంది. బలమైన బ్యాటింగ్ లైనప్.. అంతే ధీటైన బౌలింగ్ వనరులతో ప్లేఆఫ్ వైపు దూసుకెళ్తోంది.

ఆండ్రీ రస్సెల్ బ్యాటింగ్‌తో ఆ మాత్రం స్కోర్

ఆండ్రీ రస్సెల్ బ్యాటింగ్‌తో ఆ మాత్రం స్కోర్

గుజరాత్‌ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో గురువారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ కేపిటల్స్..బౌలింగ్, బ్యాటింగ్ సత్తా ఏమిటనేది మరోసారి స్పష్టమైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కత నైట్ రైడర్స్ జట్టును 154 పరుగులకే పరిమితం చేసింది. డెత్ ఓవర్లలో ఆండ్రీ రస్సెల్ చెలరేగిపోయి ఆడకపోయి ఉంటే.. ఆ మాత్రం పరుగులు కూడా స్కోర్ బోర్డుపై జమ అయ్యేవి కావు. ఆండ్రీ రస్సెల్.. 27 బంతుల్లో నాలుగు సిక్సర్లు.. రెండు ఫోర్లతో 45 పరుగులు చేశాడు. నాటౌట్‌గా నిలిచాడు.

తొలి ఓవర్ నుంచే టాప్ స్పీడ్..

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ కేపిటల్స్..తొలి ఓవర్ నుంచి టాప్ స్పీడ్‌లో దూసుకెళ్లింది. శివమ్ మావి వేసిన తొలి ఓవర్‌లోనే ఒక వైడ్ సహా 25 పరుగులొచ్చాయి. ఢిల్లీ ఓపెనర్ పృథ్వీ షా ఆరు బంతులకు ఆరు బౌండరీలను బాదేశాడు. ఒకే ఓవర్‌లో ఆరు బౌండరీలను కొట్టిన రెండో బ్యాట్స్‌మెన్ అతనే. ఇదివరకు భారత్‌కే చెందిన అజింక్య రహానే ఈ ఫీట్ సాధించాడు. నాలుగు ఓవర్లను వేయాల్సిన శివమ్.. ఆ ఒక్క ఓవర్‌ తరువాత మరోసారి బౌలింగ్ చేయడానికి ముందుకు వచ్చే సాహసం చేయలేకపోయాడు. ఒక ఓవర్‌లో 25 పరుగులను సమర్పించుకున్న బౌలర్‌గా నిలిచాడతను.

అండర్ 19 టీమ్ మేట్స్..

అండర్ 19 టీమ్ మేట్స్..

నిజానికి- పృథ్వీ షా, శివమ్ మావి టీమ్ మేట్స్. వారిద్దరూ టీమిండియా అండర్ 19 జట్టుకు ఆడారు. 2018 అండర్ 19 ప్రపంచకప్‌ను గెలిచిన భారత జట్టులో వారిద్దరూ సభ్యులు. ఒకరి బ్యాటింగ్ టెక్నిక్ మరొకరికి, ఒకరి బౌలింగ్ లొసుగులు మరొకరికి బాగా తెలుసు. శివమ్ బౌలింగ్‌లో చెలరేగిపోయి ఆడటానికి కారణాన్ని వివరించాడు పృథ్వీ షా. తామిద్దరం నాలుగైదుళ్లుగా కలిసి ఆడుతున్నామని, అతని బౌలింగ్ టెక్నిక్‌పై తనకు పూర్తి అవగాహన ఉందని చెప్పాడు. తనకు శివమ్ ఎక్కడెక్కడ బంతులను సంధిస్తాడనేది బాగా తెలుసని, అందుకే తాను ముందుగానే ప్రిపేర్ అయ్యాననీ పేర్కొన్నాడు పృథ్వీ షా.

బౌలింగ్ టెక్నిక్ బాగా తెలుసు..

బౌలింగ్ టెక్నిక్ బాగా తెలుసు..

తనకు ఎలాంటి బంతిని సంధిస్తాడు.. దాన్ని ఎలాంటి షాట్ ఆడాలనే విషయంపై ముందే ఒక అవగాహన ఉండటం వల్ల ఎలాంటి పొరపాట్లు చేయలేదని వ్యాఖ్యానించాడు. ఇన్నింగ్ తొలి ఓవర్ కావడం వల్ల లూజ్ బంతుల కోసం ఎదురు చూడాలని తాను ముందుగా భావించినప్పటికీ.. తొలి రెండు బంతులను ఎదుర్కొన్న తరువాత.. అతని బౌలింగ్ సీక్వెన్స్ ఎలా ఉండబోతోందనేది ముందే పసిగట్టానని పృథ్వీ షా చెప్పుకొచ్చాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం శివమ్ మావి.. పృథ్వీ షాను అభినందించడం.. చిరుకోపాన్ని ప్రదర్శించడం ఆకట్టుకుంది.

For Quick Alerts
Subscribe Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Friday, April 30, 2021, 8:21 [IST]
Other articles published on Apr 30, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X