
హైదరాబాద్: ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో శ్రీలంకతో జరిగిన రెండో టీ20 టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసింది. టీమిండియా నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 260 పరుగులు చేసింది. బౌలింగ్, ఫీల్డింగ్‌తో శ్రీలంక జట్టును కట్టుదిట్టం చేసి 172 పరుగుల తేడాతో గెలుపొందింది.
ఈ మ్యాచ్‌లో చెలరేగి ఆడిన రోహిత్ శర్మ శ్రీలంక బౌలర్లకు చుక్కలు చూపించాడు. 23 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించిన అతడు ఆ తర్వాత 11 బంతుల్లోనే మిగతా 50 పరుగులు పూర్తి చేసిన సెంచరీ చేశాడు. టీ20ల్లో రోహిత్ శర్మకు ఇది రెండో సెంచరీ. 35 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్సుల సాయంతో 101 పరుగులను రోహిత్ శర్మ సాధించాడు. టీ20 చరిత్రలో వేగవంతమైన సెంచరీని నమోదు చేశాడు.
సెంచరీ తర్వాత రోహిత్‌పై ప్రశంసల జల్లు కురిసింది. క్రికెటర్ మహ్మద్ కైఫ్ అయితే ట్విటర్‌లో ఓ పోస్ట్ పెట్టాడు. అందులో రోహిత్ శర్మ 100 పరుగులు చేస్తాడని, పిచ్ అతడి బ్యాటింగ్ శైలికి అనువుగా ఉందని పేర్కొన్నాడు. అంతేగాక వాట్సాప్‌లో బౌండరీల కన్నా సిక్సర్లే ఎక్కువ నమోదయ్యే పిచ్ అని వాట్సప్ సందేశం స్క్రీన్‌షాట్ పెట్టాడు.
మ్యాచ్ జరుగుతున్నప్పుడు రాత్రి 7:21 గంటలకు తన మిత్రుడికి సందేశం పంపినట్లు అందులో ఉంది. నొస్ట్రాడామస్‌లా భలే అంచనా వేశా కదా! అని ఆశ్యర్యాన్ని వెలిబుచ్చాడు. ఉద్వేగంతో రోహిత్‌కు అభినందనలు కూడా తెలిపాడు. అదంతా ఫొటోషాప్ మాయాజాలం అంటూ పలువురు విమర్శకులు కొట్టిపడేస్తున్నారు.
'రోహిత్ శర్మ! మజాక్ చేస్తున్నావ్! ఇదేమంత సులువు కాదంటూ' వీరేంద్ర సెహ్వాగ్ ఛలోక్తి విసిరాడు.
' రోహిత్ శర్మ నుంచి అవాక్కయ్యే శతకం. 35 బంతుల్లో 100. ఇదే వూపు కొనసాగాలి' అని వీవీఎస్ లక్ష్మణ్ ప్రశంసించాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.